తమిళ స్టార్ హీరో అజిత్‌కు ఒక దర్శకుడు నచ్చితే వరుసగా అతడితో సినిమాలు చేసేస్తుంటాడు. ఇంతకుముందు ‘శౌర్య’ శివతో ఇలాగే నాలుగు సినిమాలు చేసేశాడు. ‘వీరం’తో వీళ్లిద్దరూ తొలిసారి జోడీ కట్టారు. అది సూపర్ హిట్టయింది. వీరి కలయికలో వచ్చిన రెండో సినిమా ‘వేదాళం’ సైతం సూపర్ హిట్టే. దీంతో మళ్లీ ఈ జంట కలిసి ‘వివేగం’ చేసింది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా.. అజిత్ తగ్గలేదు. శివతో మళ్లీ ‘విశ్వాసం’ చేశాడు. అది బ్లాక్‌బస్టర్ అయింది.
అక్కడ కట్ చేస్తే.. శివ నుంచి బ్రేక్ తీసుకున్నాక అజిత్ హెచ్.వినోద్ అనే యువ దర్శకుడితో జట్టు కట్టాడు. శతురంగ వేట్టై, ఖాకి చిత్రాలతో వినోద్ మంచి పేరే సంపాదించాడు. అతడితో ‘పింక్’ రీమేక్ ‘నీర్కెండ పార్వై’ చేశాడు అజిత్. ఆ సినిమా బాగా ఆడింది. దీంతో వెంటనే వినోద్ సొంత కథతో ఓ సినిమా మొదలుపెట్టాడు. అదే.. వాలిమై. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందిప్పుడు.
ఈ సినిమా ఈ ఏడాదే ఏదో ఒక సమయంలో విడుదలవుతుందని ఆశిస్తున్నారు. ఐతే ఈలోపే వినోద్‌తో మరో సినిమా లైన్లో పెట్టేశాడట అజిత్. వీరి కలయికలో హ్యాట్రిక్ మూవీ వచ్చే ఏఢాది మొదలవుతుందట. నీర్కొండ పార్వై, వాలిమై చిత్రాల నిర్మాత బోనీ కపూరే మళ్లీ ఈ ఇద్దరితో కలిసి సినిమా చేయబోతున్నాడట.
ఐతే ఈ సినిమా మొదలు కావడానికి ముందు అజిత్ మధ్యలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించబోయేది తెలుగమ్మాయి అయిన సుధ కొంగర కావడం విశేషం. సూర్యతో ఆమె తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ మంచి ఫలితాన్నందుకోవడంతో తనతో సినిమా చేయడానికి అజిత్ ముందుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. అజిత్‌తో ఈ సినిమా పూర్తి చేశాక మహేష్ బాబుతో ఓ చిత్రం చేయడానికి సుధ ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 29, 2021 10:32 am
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…