Movie News

అంత మంచి ద‌ర్శ‌కుడు.. ఇలా అయ్యాడు


ఒక కాక్క కాక్క (తెలుగులో ఘ‌ర్ష‌ణ‌).. ఒక వేట్ట‌యాడు విల‌యాడు (తెలుగులో రాఘ‌వ‌న్).. ఒక ఏమాయ చేసావె.. ఒక సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ గౌత‌మ్ మీన‌న్ నుంచి వ‌చ్చిన క్లాసిక్స్ లిస్టు ఇది.. ఆయ‌న సినిమాల్లో కొన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయి ఉండొచ్చు కానీ.. అవి కూడా గొప్ప సినిమాలుగానే పేరు తెచ్చుకున్నాయి. ద‌క్షిణాది నుంచి గ‌త రెండు ద‌శాబ్దాల్లో వ‌చ్చిన మేటి దర్శ‌కుల్లో అత‌ను ఒక‌డు. ద‌ర్శ‌కుడిగా త‌న పాటికి తాను సినిమాలు తీస్తున్నంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ.. అత‌ను ప్రొడ‌క్ష‌న్లోకి అడుగు పెట్టాక తేడా కొట్టేసింది.

గౌత‌మ్ నిర్మాణ సంస్థ ఫోటాన్ క‌థాస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని.. ఈ ద‌ర్శ‌కుడి కెరీర్‌ను దారుణంగా దెబ్బ తీసేసింది. అత‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌, నిర్మించిన సినిమాల‌న్నీ వివాదాల్లో చిక్కుకున్నాయి. అందులో ధ‌నుష్ హీరోగా చేసిన ఎన్నై నొక్కి పాయుం తోట‌ సినిమా ఒక‌టి. అది అతి క‌ష్టం మీద గ‌త ఏడాది విడుద‌లైంది. కానీ ఫ్లాప్ అయింది.

విక్ర‌మ్‌తో తీసిన ధ్రువ‌న‌క్ష‌త్రం అడ్ర‌స్ లేదు. గౌత‌మ్ నిర్మాణంలో తెర‌కెక్కిన న‌ర‌కాసుర‌న్ కూడా బ‌య‌టికి రాలేదు. వీటిని బ‌య‌టికి తీసుకురాలేక‌పోగా.. కొత్త సినిమాలు కూడా డైరెక్ట్ చేసే స్థితిలో గౌత‌మ్ లేడు. మ‌ధ్య‌లో జ‌య‌ల‌లిత మీద ఒక వెబ్ సిరీస్ తీశాడు. అది ప‌క్క‌న‌పెడితే.. గౌత‌మ్ ద‌గ్గ‌ర మంచి మంచి స్క్రిప్టులున్నాయి. అత‌ను ఇప్ప‌టికీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. కానీ ఆర్థిక వివాదాల కార‌ణంగా ఏ సినిమానూ డైరెక్ట్ చేయ‌లేని ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితుల్లో అత‌ను ఖాళీగా ఉండ‌లేక‌ న‌ట‌న వైపు అడుగులేశాడు.

మ‌ల‌యాళంలో చేసిన ట్రాన్స్‌తో మంచి పేరొచ్చింది. పావ క‌థైగల్ అనే యాంథాల‌జీ వెబ్ ఫిలింతోనూ ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు న‌టుడిగా అత‌ను బిజీ అయిపోయాడు. ద‌ర్శ‌కుడిగా త‌న నుంచి స్ఫూర్తి పొందిన‌ వెట్రిమార‌న్ డైరెక్ష‌న్లోనూ న‌టిస్తున్నాడు. కానీ గౌత‌మ్ నుంచి ద‌ర్శ‌కుడిగా సినిమాలు ఆశిస్తున్న అభిమానుల‌కు మాత్రం నిరాశ త‌ప్ప‌ట్లేదు. మ‌ళ్లీ అత‌నెప్పుడు డైరెక్ట్ చేస్తాడో మ‌రి.

This post was last modified on April 24, 2021 9:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

1 hour ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

2 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

2 hours ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

2 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

3 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

3 hours ago