వకీల్ సాబ్ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. కానీ చెప్పుకోదగ్గ షేర్ ఏమీ రాలేదు. ఆ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. ఏపీలో కొవిడ్ సహా వేరే సమస్యలుండటంతో చాలా చోట్ల ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా థియేటర్లు మూసేస్తున్నారంటే ఈ సినిమాకు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదని, చూడాల్సిన వాళ్లందరూ చూసేశారని అర్థం చేసుకోవచ్చు. మరి అంతిమంగా ఈ సినిమా ఫలితమేంటి అంటే.. హిట్ అన్నది ట్రేడ్ వర్గాల మాట. ‘వకీల్ సాబ్’ రూ.90 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.
చాలా చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. కొందరు స్వల్ప లాభాలందుకున్నారు. కొందరు స్వల్పంగా నష్టపోయారు. ఒక్క యుఎస్‌లో మాత్రమే ఈ చిత్రం ఫ్లాప్ అయింది. అక్కడ పెట్టుబడిని రికవర్ చేయలేకపోయింది. బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఆగిపోయింది. అది డిఫరెంట్ టెరిటరీ కాబట్టి దాన్ని పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో అయితే బయ్యర్లందరూ ఆల్ హ్యాపీస్ అన్నట్లే. కాకపోతో కరోనా చివర్లో దెబ్బ కొట్టి ఆదాయాన్ని కొంచెం తగ్గించింది. ఏపీలో టికెట్ల రేట్లు మునుపటిలా ఉంటే మాత్రం బయ్యర్లు, ఎగ్జిబిటర్ల పంట పండేది. ధరల మీద నియంత్రణలోనూ ఈ సినిమా చాలా బాగా పెర్ఫామ్ చేసినట్లే.
బయ్యర్లు, ఎగ్జిబిటర్ల సంగతిలా ఉంచితే.. ఈ సినిమా విషయంలో మిగతా అందరూ చాలా హ్యాపీ అన్నట్లే. పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో మంచి సక్సెస్ అందుకున్నాడు. భారీగా పారితోషకం దక్కింది. ఇక పవన్‌తో సినిమా తీయాలన్న తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్న దిల్ రాజు, తన అభిమాన హీరోకు రీఎంట్రీలో మంచి సక్సెస్ ఇచ్చాడు. అలాగే తాను కూడా భారీగా లాభాలందుకున్నాడు. దాదాపు రూ.50 కోట్ల దాకా సినిమా మీద లాభాలు వచ్చాయట. కొంత బోనీ కపూర్‌కు వాటా ఇచ్చి మెజారిటీ షేర్ రాజు తీసుకోనున్నాడు. ఇక తొలిసారి ఓ పెద్ద హీరోను డైరెక్ట్ చేసి మెప్పించిన వేణు శ్రీరామ్‌కు ఈ సినిమా బాగా ఉపయోగపడేదే. సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన మిగతా నటీనటులకు, అలాగే టెక్నీషియన్లకు కూడా మంచి పేరొచ్చింది. ఇక చివరగా పవన్ అభిమానులు ‘వకీల్ సాబ్’ ఫలితం పట్ల, ఇందులో పవన్‌ను చూపించిన విధానం పట్ల పూర్తిగా సంతృప్తి చెందారు. ఆ రకంగా ‘వకీల్ సాబ్’ అందరికీ సంతోషాన్నిచ్చిన సినిమా అన్నమాట.
This post was last modified on April 23, 2021 9:04 am
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…