గతంలో ఓ విదేశీ అమ్మాయి ఎవరైనా మన సినిమాల్లో నటిస్తే ఆశ్చర్యపోయి చూసేవాళ్లం. కానీ గత దశాబ్దంలో ఆ ఆలోచన పూర్తిగా మారిపోయింది. విదేశీ అమ్మాయిలు పెద్ద ఎత్తున భారతీయ సినిమాలోకి దిగుమతి అయ్యారు. ఇక్కడ ఐటెం సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్లతో వాళ్లు మెరిసిపోతున్నారు. మన ఇండస్ట్రీల్లోనే స్థిరపడిపోతున్నారు. అమీ జాక్సన్, సన్నీ లియోన్, నోరా ఫతేహి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా పెద్దే.
కాస్త లేటుగా ఈ లిస్టులోకి చేరిన అమ్మాయి ఎల్లి అవ్రామ్. ఈ స్వీడన్ అమ్మాయి తెలుగులో ‘నా పేరు సూర్య’ మాత్రమే కాక.. హిందీలో బోలెడన్ని సినిమాల్లో మెరిసింది. ఎక్కువగా ఆమె చేసింది ఐటెం సాంగ్సే. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫొటో షూట్లతో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అథ్లెటిక్ ఫీచర్స్‌తో ఆమె ఇచ్చే పోజులు కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తుంటాయి.
తాజాగా ఎల్లి అవ్రామ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో అబ్బుర పరుస్తోంది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో తీసిన ఫొటో అట అది. ఎల్లికి జోడీగా ఉన్న అబ్బాయి ఎవరో, ఇది ఏ సినిమా షూటింగో తెలియదు కానీ.. ఆ సమయంలో ఐస్ కోల్డ్ వాటర్లో తాను స్టెప్పులేసినట్లు ఆమె వెల్లడించింది. ఒక కాలు సమాంతరంగా చాచి.. ఇంకో కాలును అంతే సమాంతరంగా వెనక్కి వంచిన తీరు చూస్తే అబ్బుర పడకుండా ఉండలేం.
జిమ్నాస్టిక్స్‌లో మంచి నైపుణ్యం సంపాదిస్తే తప్ప అలా కాలును వెనక్కి వంచడం సాధ్యం కాదు. తెల్లవారుజామున చన్నీళ్ల రెయిన్ ఎఫెక్ట్‌లో ఇలాంటి స్టెప్పులేయడం చాలా కష్టమైన విషయమే అని.. కానీ నటిగా ఇలాంటి తీపి బాధను ఎదుర్కోవడం సంతోషమే అంటూ కొంచెం ఎమోషనల్‌గా ఈ పోస్ట్ పెట్టింది ఎల్లి.
This post was last modified on April 20, 2021 6:03 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…