ర‌జనీ క‌ర్చీఫ్ వేసేశాడు

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ మ‌ధ్య సంక్రాంతి హీరో అయిపోయాడు. గ‌త రెండేళ్లూ సంక్రాంతికి ఆయ‌న సినిమాలు వ‌చ్చాయి. 2019లో పేట రిలీజైతే 2020లో ద‌ర్బార్ సంక్రాంతికి సంద‌డి చేసింది. ఆయ‌న త‌ర్వాతి ఏడాది కూడా సంక్రాంతికి త‌న సినిమాను రేసులో నిల‌బెట్టేశాడు. ఆ సినిమానే.. అన్నాతె. తెలుగులో శౌర్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయ‌మై త‌మిళంలో అజిత్‌తో వీరం, వేదాళం, విశ్వాసం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించిన శివ డైరెక్ష‌న్లో ర‌జ‌నీ ఈ చిత్రాన్ని చేస్తున‌న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. సినిమా ఆల‌స్య‌మైంది. ఐతే లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో.. షూటింగులు ఎప్పుడు పునఃప్రారంభ‌మ‌వుతాయో క్లారిటీ లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఈ చిత్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఉన్న‌ట్లుండి రిలీజ్ డేట్ గురించి ఓ వీడియో రిలీజ్ చేసింది. అన్నాతె సంక్రాంతికి రిలీజ‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది.

ఆర్ఆర్ఆర్ వ‌చ్చే సంక్రాంతికే షెడ్యూల్ అయిన నేప‌థ్యంలో ఇటు తెలుగులో, అటు త‌మిళంలో వేరే పెద్ద సినిమాల సంద‌డి లేక‌పోవ‌చ్చ‌ని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో ఆ సినిమా సంక్రాంతికి రావ‌డం క‌ష్ట‌మ‌ని తేలిపోయింది. తెలుగులో వ‌కీల్ సాబ్ లేదంటే ఆచార్య సంక్రాంతికి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

త‌మిళంలో ముందుగా ర‌జనీ బెర్తు బుక్ చేసేశాడు. అన్నాతెలో కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. శివ గ‌త సినిమాల స్ట‌యిల్లోనే ఇది కూడా రూర‌ల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే మాస్ సినిమా అని తెలుస్తోంది.