Movie News

వివేక్.. ది లెజెండ్


80ల నుంచి గమనిస్తే తెలుగు సినిమాల్లో ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు కనిపిస్తారు. ముఖ్యంగా జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ లాంటి దర్శకులు కమెడియన్లనే నమ్ముకుని సినిమాలు తీసేవాళ్లు. వాళ్ల పుణ్యమా అని టాలీవుడ్లో రెండంకెల సంఖ్యలో పేరుమోసిన కమెడియన్లుండేవాళ్లు. తొంభైల చివర్లో మన సినిమాల్లో నవ్వించడానికి బోలెడంత మంది కమెడియన్లు కనిపించేవాళ్లు. కానీ అటు తమిళ సినిమాల్లో చూస్తే ఒకే ఒక్కడు కామెడీ భారాన్నంతా మోసేవాడు. కానీ నవ్వులకు ఢోకానే లేకపోయేది. ఆ కమెడియన్ మరెవరో కాదు.. వివేక్. తమిళ సినిమాల్లో కామెడీ తక్కువేమీ కాదు కానీ.. అక్కడ కమెడియన్ల సంఖ్య బాగా తక్కువ.

80వ దశకాన్ని గౌండ్రమణి-సెంథిల్ జోడీతో పాటు, వడివేలు ఏలగా.. 90వ దశకంలో సగం వరకు మాత్రమే వారి జోరు సాగింది. వీరి ఆధిపత్యానికి గండి కొడుతూ తమిళ సినీ పరిశ్రమలో తిరుగులేని కమెడియన్‌గా ఎదిగిన నటుడు వివేక్.

90ల చివరికి వచ్చేసరికి ఏ స్టార్ హీరో అయినా, ఏ స్టార్ దర్శకుడైనా సరే.. కామెడీ పాత్ర కోసం వివేక్ వైపే చూసే పరిస్థితి. ప్రతి పేరున్న సినిమాలోనూ వివేక్ ఉండేవాడు. అప్పటిదాకా కమెడియన్లంటే అంద విహీనంగా, కొంచెం వికారంగా, టిపికల్‌గా ఉండాలనే అభిప్రాయం జనాల్లో ఉండేది. అలా ఉంటేనే కామెడీ పండుతుందనే ఫీలింగ్ ఉండేది. కానీ వివేక్ మాత్రం హీరోలకు దీటైన గ్లామర్‌తో కనిపిస్తూ కామెడీ పండించడం విశేషం. కామెడీ టైమింగ్ విషయంలో వివేక్‌ది ఒక ప్రత్యేకమైన శైలి. అతడి డైలాగ్ డెలివరీ, హావభావాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

90ల ద్వితీయార్ధం నుంచి ఓ దశాబ్దం పాటు తమిళ సినిమాల్లో వివేక్ హవా మామూలుగా సాగలేదు. ఈ మధ్యలో అతను ఏకంగా 200 సినిమాలు చేయడం విశేషం. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య.. ఇలా ప్రతి స్టార్ హీరోతోనూ వివేక్ కలిసి పని చేశాడు. ఆ కాలంలో అందరు అగ్ర దర్శకులతోనూ కలిసి పని చేశాడు వివేక్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ అతడి కోసం ప్రత్యేకమైన పాత్రలు రాయించేవాడు. శంకర్ చిత్రాలు బాయ్స్, అపరిచితుడు, శివాజీ లాంటి సినిమాలతో వివేక్ తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇవి కాక సింగం, రఘువరన్ బీటెక్ లాంటి చిత్రాల్లో సైతం వివేక్ కామెడీ మనవాళ్లను అలరించింది. తమిళ భాష తెలియని వాళ్లు సైతం వివేక్ టైమింగ్‌కు కనెక్ట్ అయిపోయి.. పగలబడి నవ్వాల్సిందే అన్నట్లుగా ఉంటుంది అతడి కామెడీ.

సంతానం హవా మొదలయ్యాక వివేక్ బ్యాక్ సీట్ తీసుకోవాల్సి వచ్చింది. అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ ఎఫ్పుడైనా ఛాన్స్ వస్తే ఆయన పూర్తి స్థాయిలో నవ్వించేవారు. కామెడీ చేస్తూనే సీరియస్ యాక్టింగ్‌తోనూ ఆకట్టుకోవడం వివేక్ ప్రత్యేకత. గత దశాబ్ద కాలంలో వివేక్ చేసిన సినిమాలు చాలా తక్కువ. నటుడిగానే కాక వ్యక్తిగానూ వివేక్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తమిళనాట చెట్ల పెంపకం మీద ఎన్నో ఏళ్లుగా ఆయన కృషి చేస్తున్నారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించి లక్షల్లో చెట్లు నాటించారు. మరెన్నో సామాజిక కార్యక్రమాల్లో వివేక్ పాల్గొన్నారు. ఇంత మంచి వ్యక్తి ఆరేళ్ల కిందట అనారోగ్యం కారణంగా కొడుకును కోల్పోయి విషాదం ఎదుర్కొన్నారు. ఆ బాధ నుంచి ఆయన కోలుకోలేకపోయారంటారు. మొన్నటి వరకు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న వివేక్.. 60 ఏళ్ల వయసుకే ఇలా అర్ధంతరంగా తనువు చాలించి వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర విషాదంలోకి నెడుతోంది.

This post was last modified on April 17, 2021 2:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌ని టీడీపీ ..!

టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆదిమూలంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయంగా వైసీపీ పుంజుకునే అవ‌కాశం వ‌చ్చింద‌నే చ‌ర్చ జ‌రిగింది. నిన్న మొన్న‌టి…

3 hours ago

బెంగళూరును ముంచెత్తిన గోట్.. గొడవ గొడవ

బెంగళూరులో స్థానికేతరుల ఆధిపత్యం గురించి లోకల్స్ గొడవ చేయడం ఎప్పట్నుంచో ఉన్న సమస్య. ఈ మధ్య ఈ గొడవ మరింత…

6 hours ago

దేవర ఊపు మామూలుగా లేదు

వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయాక ‘కల్కి’ జోరుతో కొంచెం కోలుకుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ కొంత ఉత్సాహాన్నిచ్చింది. భారీ వర్షాల్లోనూ…

6 hours ago

పొలిటిక‌ల్ టాక్‌- జ‌గ‌న్ కంటే ష‌ర్మిల న‌యం

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా చాలా వెనుక‌బ‌డి పోయారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 మం…

6 hours ago

రాజ్‌కే ఆమె 70 లక్షలిచ్చిందట

ఈ మధ్య కొన్ని వారాల పాటు యువ కథానాయకుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే.…

7 hours ago

దేవర కొత్త పాట.. ఇటు విమర్శలు అటు వైరల్

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘దేవర’ ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు…

7 hours ago