సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడు శంకర్. సామాజికాంశాలతో ముడిపడ్డ కథలకు కమర్షియల్ టచ్ ఇస్తూ సౌత్ సినిమాను తిరుగులేని స్థాయికి తీసుకెళ్లిన ఘనత అతడిది. ‘జెంటిల్‌మ్యాన్’తో మొదులపెట్టి.. ‘రోబో’ వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన శంకర్.. గత కొన్నేళ్లలో మాత్రం తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. పైగా ఈ మధ్య ప్రతికూల కారణాలతోనే శంకర్ వార్తల్లో నిలుస్తుండటం అభిమానులను కలవర పరుస్తోంది. ముఖ్యంగా అతడికి వరుసగా నిర్మాతలతో వివాదాలు తలెత్తుతుండటం గమనార్హం.
‘ఇండియన్-2’ సినిమాను మధ్యలో వదిలేసి వేరే సినిమాకు వెళ్లిపోయాడంటూ లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కొన్ని రోజుల కిందట అతడిపై కేసు పెట్టడం తెలిసిన సంగతే. కోర్టులో పోరాడి ఆ వివాదం నుంచి బయటపడ్డ శంకర్‌కు ఇప్పుడు మరో నిర్మాత నుంచి షాక్ తగిలింది. ఆ నిర్మాత ఎవరో కాదు.. శంకర్‌తో ‘అన్నియన్’ (అపరిచితుడు) సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఆస్కార్ రవిచంద్రన్.
తన బ్లాక్ బస్టర్ మూవీ ‘అన్నియన్’ ఆధారంగా హిందీలో రణ్వీర్ సింగ్‌తో సినిమా చేయబోతున్నట్లు శంకర్ బుధవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఎక్కడా రీమేక్ అని వాడకుండా అడాప్షన్ అని మాత్రమే శంకర్ పేర్కొన్నాడు. కాగా ఆస్కార్ రవిచంద్రన్.. తన అనుమతి లేకుండా ‘అన్నియన్’ సినిమాను ఎలా రీమేక్ చేస్తావంటూ శంకర్‌ను ప్రశ్నించాడు. ఆ సినిమా కథకు సంబంధించిన హక్కులన్నీ తన దగ్గరే ఉన్నాయని.. రచయిత సుజాత దగ్గర్నుంచి డబ్బులు చెల్లించి కథను కొన్న డాక్యుమెంట్లు కూడా చూపిస్తానని.. అలాంటిది తనకు మాట మాత్రమైనా చెప్పకుండా ‘అన్నియన్’ హిందీ రీమేక్‌ను ఎలా ప్రకటిస్తారంటూ శంకర్‌ను నిలదీశాడు రవిచంద్రన్.
‘బాయ్స్’ సినిమాతో దెబ్బ తిన్న శంకర్‌కు అవకాశం ఇచ్చి ‘అన్నియన్’ చేయించి అతడి కెరీర్‌ను నిలబెట్టిన ఘనత తనదేనని, అలాంటిది తన అనుమతి లేకుండా ‘అన్నియన్’ రీమేక్ చేయడమేంటని రవిచంద్రన్ ప్రశ్నించాడు. శంకర్‌కు తన నుంచి లీగల్ నోటీసులు వెళ్లనున్నట్లు ప్రెస్ నోట్లో రవిచంద్రన్ స్పష్టం చేశాడు. మరి దీనిపై శంకర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
This post was last modified on April 15, 2021 3:21 pm
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…