అల్లు అర్జున్ ఫీల్డింగ్ సెట్ చేస్తున్నాడు!

పాన్ ఇండియా సినిమా కోసం రాజమౌళి తనతో చేసే వరకు వేచి చూడకుండా, సుకుమార్ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు ‘పుష్ప’ అల్లు అర్జున్. రాజమౌళి దర్శకుడంటే పాన్ ఇండియా అప్పీల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ, సుకుమార్ సినిమా అంటే బాగా పుష్ చేయాలి.

అందుకే పుష్పని పుష్ చేసే పనిలో బన్నీ ఇప్పుడే బిజీ అయ్యాడు. అల వైకుంఠపురములో టైంలోనే అల్లు అర్జున్ ముందు చూపుతో బాలీవుడ్ మీడియాతో టచ్ లోకి వెళ్ళాడు. ఆ సినిమాకి పర భాషలతో సంబంధం లేకపోయినా కానీ బాలీవుడ్ మీడియాతో అల్లు అర్జున్ ఆ సినిమా పేరుతో రిలేషన్ పెంచుకున్నాడు. పుష్ప చిత్రం ప్రమోట్ చేయడం కోసం అక్కడి మీడియాని బన్నీ వాడుతున్నాడు.

ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకపోయినా కానీ ఆ మీడియాకి అల్లు అర్జున్ అప్డేట్స్ ఇస్తూ కాంటాక్ట్ లో ఉంటున్నాడు. అలాగే బన్నీ తరఫున వారికి మంచి బహుమానాలు కూడా వెళుతున్నాయట. మాములుగా మన హీరోలు సినిమా విడుదలకి ముందు మీడియాని మచ్చిక చేసుకోవాలని చూస్తారు. కానీ అల్లు అర్జున్ కి ముందు చూపు ఎక్కువన్నమాట.