చిన్న పెద్ద అని తేడా లేదు. కాస్త పేరున్న ఏ సినిమా రిలీజైనా రాత్రికే కలెక్షన్ల లెక్కలు బయటికి వచ్చేస్తుంటాయి. మరుసటి రోజు అన్ని బాక్సాఫీస్ వెబ్ సైట్లూ వసూళ్ల లెక్కలు పెట్టేస్తుంటాయి. పీఆర్వోలు ట్వీట్ల ద్వారా వివరాలు ప్రకటిస్తుంటారు. ఇక పెద్ద హీరో సినిమా అంటే.. రికార్డుల మీద అందరికీ గురి ఉంటుంది కాబట్టి కలెక్షన్లు సాధ్యమైనంత త్వరగా బయటపెట్టేస్తుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతిసారీ రికార్డుల గురించి కూడా చర్చ జరుగుతుంటుంది. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందన్నదానితో సంబంధం లేకుండా ఓపెనింగ్ రికార్డులు నమోదవుతుంటాయి.
అలాంటిది ‘వకీల్ సాబ్’కు అదిరిపోయే టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లు సాధించిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడా ‘వకీల్ సాబ్’ కలెక్షన్ల లెక్కలు కనిపించడం లేదు. ఇది అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
‘వకీల్ సాబ్’ కలెక్షన్లను ఉద్దేశపూర్వకంగానే బయట పెట్టట్లేదని తెలుస్తోంది. ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో రగడ నడుస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ముందు రేట్లు పెంచి టికెట్లు అమ్మారు. కానీ ప్రభుత్వ అధికారులు ఎక్కడిక్కడ థియేటర్లపై దాడులు చేయడం.. రేట్లు పెంచడానికి వీల్లేదని ప్రభుత్వం జీవో జారీ చేయడం.. అమ్మిన టికెట్లకు కొందరు రీఫండ్ చేయగా.. కొందరు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడం.. ఈ లోపు రేట్ల పెంపునకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. తాజాగా ప్రభుత్వం దానిపై పిటిషన్ వేయడం.. ఇలా ఏపీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ ఏపీలో ఎంత వసూళ్లు రాబట్టిందన్న విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ క్లారిటీ ఉన్నా కూడా ప్రభుత్వం ఈ సినిమాకు వ్యతిరేకంగా నిలబడ్డ నేపథ్యంలో కలెక్షన్ల లెక్కలు చెప్పి ఎక్కడ బుక్ అవుతామో అన్న భయంలోనూ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వసూళ్ల వివరాలను బయట పెట్టట్లేదని.. దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో చెప్పలేమని ట్రేడ్ పండిట్లు అంటున్నారు.
This post was last modified on April 10, 2021 2:14 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…