రామ్ చరణ్-శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో అతి త్వరలోనే సినిమా మొదలవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’తో మరో స్థాయికి వెళ్లబోతున్న రామ్ చరణ్.. ఆ తర్వాత వెంటనే శంకర్ లాంటి అగ్రశ్రేణి దర్శకుడితో సినిమా చేయబోతుండటంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. శంకర్ తన స్థాయికి తగ్గ సినిమా తీస్తే ఈ సినిమా మెగా సక్సెస్ కావడం ఖాయం.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ భారీగా ఉండేలా చూసుకుంటోంది చిత్ర బృందం. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ సినిమాకు కథానాయికగా ఎంపికైనట్లు.. తనతో పాటు ఓ కొరియన్ బ్యూటీ కూడా ఇందులో నటించబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక కీలకమైన అతిథి పాత్ర ఉన్నట్లు కూడా ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఆ పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించే అవకాశాలున్నాయంటూ క్రేజీ రూమర్ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
సల్మాన్‌తో రామ్ చరణ్‌కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ బాలీవుడ్ మూవీ ‘జంజీర్’లో నటించేటపుడు ముంబయిలో ప్రతి రోజూ అతడికి సల్మాన్ ఇంటి నుంచే క్యారియర్ వెళ్లింది. సల్మాన్ హైదరాబాద్‌లో షూటింగ్‌కు వచ్చినా చిరు ఇంటి నుంచి క్యారియర్ వెళ్తుంటుంది. చరణ్ తరచుగా సల్మాన్‌ను కలుస్తుంటాడు కూడా. ఈ అనుబంధంతోనే సల్మాన్ నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్‌పాయో’ తెలుగు వెర్షన్‌లో సల్మాన్ పాత్రకు చరణే డబ్బింగ్ చెప్పాడు.
ఇప్పుడు చరణ్ కోసం శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తీయబోయే పాన్ ఇండియా సినిమాలో అతిథి పాత్ర చేయమంటే సల్మాన్ కాదంటాడని అనుకోలేం. కాబట్టి ఈ సినిమాలో సల్మాన్ నటించే అవకాశాలే ఎక్కువ. నిజంగా అదే జరిగితే ఈ చిత్రానికి ఉత్తరాదిన బంపర్ క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు. ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్‌కు కూడా నార్త్‌లో పాపులారిటీ పెరుగుతుంది కాబట్టి అతడికి సల్మాన్ తోడైతే ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో జరిగే అవకాశముంది. ఈ చిత్రాన్ని జులైలో సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించిన సంగతి తెలిసిందే.
This post was last modified on April 9, 2021 7:43 am
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…