మామూలుగా స్టార్ హీరోలు ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటారు. ఎప్పుడో కానీ ప్రయోగాల బాట పట్టరు. ఇలాంటపుడు రొటీన్ సినిమాలను చూసి విసుగెత్తిపోయిన ప్రేక్షకులు, అభిమానులు కొంచెం భిన్నంగా ప్రయత్నించాలని, ప్రయోగాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అక్కినేని నాగార్జున విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. ఆయన ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ప్రయోగాలు చేసుకుంటూ పోతుంటే.. అభిమానులు అలాంటి సినిమాలు వద్దు మొర్రో అని గగ్గోలు పెడుతున్నారు.
ఐదేళ్ల కిందట నాగ్ నుంచి వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరహా మాస్ సినిమాలను వాళ్లు కోరుకుంటున్నారు. డల్లుగా సాగుతున్న నాగ్ కెరీర్‌కు మంచి ఊపునిచ్చిన సినిమా అది. ఐతే ఆ ఊపును తర్వాత ఆయన కొనసాగించలేకపోయారు. ‘ఊపిరి’లో చక్రాల కుర్చీకి పరిమితమయ్యే పాత్ర చేయగా.. ఆ సినిమాకు విమర్శల ప్రశంసలు దక్కాయి. వసూళ్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఆ తర్వాత మాత్రం నాగ్‌ను వరుసగా పరాజయాలే పలకరించాయి.
మిగతా సినిమాల మాటెలా ఉన్నా.. అభిమానులు సహా వద్దు వద్దంటున్నా దర్శకుడిగా పతనం అయిపోయిన రామ్ గోపాల్ వర్మతో ‘ఆఫీసర్’ చేసి నాగ్ తన కెరీర్‌కు చేసుకున్న నష్టం అంతా ఇంతా కాదు. ఆ దెబ్బతో ఈ అక్కినేని హీరో మార్కెట్ దారుణంగా దెబ్బ తినేసింది. ఆ దెబ్బ నుంచి మళ్లీ ఆయన కోలుకోలేకపోయారు. నానితో కలిసి చేసిన ‘దేవదాసు’ సరిగా ఆడలేదు. ‘మన్మథుడు-2’ డిజాస్టర్ అయింది. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’ అంటూ మరో భిన్నమైన సినిమా చేసి బోల్తా కొట్టారు. ఇవేవీ కూడా అభిమానులు నాగ్ నుంచి ఆశించే తరహా సినిమాలు కాదు.
వయసు మీద పడిందనో, బేసిగ్గా భిన్నంగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనో నాగ్ మిగతా స్టార్ హీరోల్లా మాస్ మసాలా సినిమాలు చేయట్లేదు. అలాగని ప్రయోగాలు చేసి సరైన ఫలితాలు అందుకుంటున్నారా అంటే అదీ లేదు. ఆఫీసర్, వైల్డ్ డాగ్ సినిమాలు బోల్తా కొట్టాక కూడా ఇప్పుడు మళ్లీ ప్రవీణ్ సత్తారు సినిమాలో పోలీస్ తరహా పాత్రనే చేస్తుండటం అభిమానులకు రుచించట్లేదు. ఇప్పటికైనా నాగ్ తమకేం కావాలో అర్థం చేసుకుని మంచి మాస్ మసాలా సినిమా తీయాలని, కుదిరితే సాధ్యమైనంత త్వరగా ‘బంగార్రాజు’ను మొదలుపెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on April 8, 2021 2:33 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…