అల్లు కొత్త సినిమా ‘పుష్ప’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ అంచనాల్ని పెంచేలా ఈ రోజు చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ నెల 8న బన్నీ పుట్టిన రోజు కాగా.. ముందు రోజు టీజర్ వదలబోతున్నట్లు ఈ వీడియో ద్వారా సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా టాలీవుడ్లో ఏ హీరో చేయని సాహసం చేస్తున్నాడు బన్నీ ఈ సినిమా కోసం.
జుట్టు, గడ్డం పెంచి.. మాసిన బట్టలేసుకుని.. ఊర మాస్‌గా తయారయ్యాడతను. మామూలుగా తమిళ హీరోలు మాత్రమే ఇలాంటి అవతారాల్లో కనిపిస్తుంటారు. టాలీవుడ్ స్టార్లు ఎంత మాస్ పాత్రలు వేసినా సరే.. గ్లామరస్‌గా కనిపించాలనే చూస్తారు. ‘పుష్ప’లో బన్నీ తరహాలో కనిపించడానికి భయపడతారు. కానీ బన్నీ ఈ సాహసం చేసి ప్రేక్షకుల మనసులు గెలిచాడు. ఇప్పుడు బన్నీ లుక్, అతడి క్యారెక్టరే సినిమాకు హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా రష్ చూసిన వాళ్లు చెబుతున్న సమాచారం ప్రకారం.. బన్నీ కెరీర్లోనే ‘ది బెస్ట్’ క్యారెక్టర్‌గా పుష్పరాజ్ నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. బయట చూస్తే బన్నీ మామూలుగా కనిపిస్తాడు కానీ.. సెట్స్ మీదికి వెళ్తే పాత్రలను ఓన్ చేసుకుని పెర్ఫామ్ చేసే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ‘నా పేరు సూర్య’ ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ.. సూర్య లాంటి ఫెరోషియస్ పాత్రలో అతను ఎంత బాగా పెర్ఫామ్ చేశాడో తెలిసిందే.
ఇప్పుడు పుష్పరాజ్ పెర్ఫామెన్స్ పరంగా అతడికి ఇంకా ఎక్కువ స్కోప్ ఇచ్చిందని, నటీనటుల నుంచి వాళ్ల కెరీర్లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ రాబడతాడని పేరున్న సుక్కు కూడా తోడవడంతో బన్నీ ఈ సినిమాలో విశ్వరూపమే చూపించబోతున్నాడని అంటున్నారు. చిత్తూరు యాసతో, నడవడిక సాగే పుష్పరాజ్ పాత్రకు అలవాటు పడటానికి బన్నీ మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డాడని.. కానీ కొన్ని రోజులకు దాన్ని బాగా ఆకళింపు చేసుకున్నాడని.. కొన్ని రోజుల నుంచి పూర్తిగా పుష్పరాజ్ పాత్రలోకి దిగిపోయి అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తున్నాడని.. ఈ సినిమాలో బన్నీని చూసి అభిమానులు ఉర్రూతలూగిపోవడం ఖాయమని చిత్ర వర్గాల సమాచారం.
This post was last modified on April 3, 2021 7:25 pm
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…