దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ కెరీర్ మొదట్లో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఒక అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. అయితే రోబో అనంతరం అతని జడ్జిమెంట్ తేడా కొట్టేస్తోంది. దరిద్రమో లేక ధీమాక్ లో పస తగ్గిందో ఏమో గాని అనేక రకాల ఇబ్బందులను ఏదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు లైకా దెబ్బకు రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమాకు బ్రేకులు పడేలా ఉన్నాయి. ఇండియన్ 2 నిర్మాతలు కోర్టుకెక్కినట్లు తెలుస్తోంది.
లైకా ప్రొడక్షన్ లో చేసిన 2.ఓ కోసం 500కోట్ల వరకు ఖర్చు చేయించిన శంకర్ ఊహించని రిజల్ట్ ను అందుకున్నాడు. ఇక కమిట్మెంట్ ప్రకారం 2.ఓ నష్టాలను పూరించాలని ఇండియన్ 2ను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. 300కోట్లతో అనుకున్న ఆ సినిమా బడ్జెట్ శంకర్ ప్లాప్స్ కారణంగా లైకా వాళ్ళు 230కు తెగ్గొట్టారు. మధ్యలో కమల్ ఆలస్యం, యాక్సిడెంట్, కోవిడ్ వంటి ఘటనలతో సినిమా మరింత ఆలస్యం అయ్యింది.
ఇక లాక్ డౌన్ తరువాత అయినా సినిమాను స్టార్ట్ చేస్తారని అనుకుంటే లైకా ప్రొడక్షన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రెమ్యునరేషన్ విషయంలో హార్ట్ అయినట్లు టాక్ వచ్చింది. దీంతో శంకర్ రామ్ చరణ్ తో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు లైకా హై కోర్టుకు వెళ్లింది. 230కోట్ల బడ్జెట్ లో ఇప్పటికే 180కోట్ల వరకు ఖర్చు చేసిన శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయకుండా మరో సినిమా స్టార్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మిగతా రెమ్యునరేషన్ ను చెల్లిస్తామని వెంటనే అతని తదుపరి సినిమాలను ఆపేసి ఇండియన్ 2ను పూర్తి చేయాలని కేసు వేశారు. దీంతో న్యాయస్థానం శంకర్ సమాధానం కోసం నోటీసులు పంపింది. మరి శంకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
This post was last modified on April 1, 2021 1:43 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…