పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా పింక్ రీమేక్‌ను ఎంచుకోవడం అతడి అభిమానులకు అస్సలు నచ్చలేదు. పైగా ఈ చిత్రానికి దర్శకుడు వేణు శ్రీరామ్ అనేసరికి వాళ్లలో వ్యతిరేకత ఇంకా పెరిగిపోయింది. దీనికి ముందు వేణు ట్రాక్ రికార్డు అలా ఉంది మరి. ఓ మై ఫ్రెండ్ లాంటి ఫ్లాప్ మూవీతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రవితేజతో ఓ సినిమా మొదలుపెడితే.. అది ముందుకే సాగలేదు. చాలా గ్యాప్ తర్వాత తీసిన ఎంసీఏతో హిట్టయితే కొట్టాడు కానీ.. అది రొటీన్ మూవీ అనే విమర్శలు వచ్చాయి.
ఇలాంటి దర్శకుడితో పవన్ సినిమా చేయడమేంటి అన్నది అప్పుడు పవన్ అభిమానుల అభ్యంతరం. కానీ ఇప్పుడు అదే పవన్ ఫ్యాన్స్ వేణు మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. వేణు శ్రీరామ్.. ది మాస్ గాడ్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఒకప్పుడు వేణును వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటుండం విశేషం.
పింక్ లాంటి సబ్జెక్టును తీసుకుని.. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ కలర్ తీసుకురావడం పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. టీజర్, ఆ తర్వాత రిలీజ్ చేసిన ప్రోమోల్లో పవన్‌ను చూసి అభిమానులు మురిసిపోయారు.ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే పవన్ బెస్ట్ లుక్‌లో కనిపించాడిందులో. అలాగే పవన్ మేనరిజమ్స్, హావభావాలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి అభిమానులను.
ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులో పవన్ అభిమానులు మెచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయడం.. అదే సమయంలో ఒరిజినల్ చెడకుండా చూసుకోవడం తేలికైన విషయం కాదు. ఈ బ్యాలెన్స్ అందరికీ నచ్చుతోంది. పవన్ అభిమానులైతే ఇప్పుడు వేణును తెగ పొగిడేస్తున్నారు. పవన్‌కు మంచి రీఎంట్రీ మూవీ ఇస్తున్నాడంటూ అతణ్ని కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే మాస్ గాడ్ వేణు శ్రీరామ్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెడుతుండటం విశేషం.
This post was last modified on March 31, 2021 7:34 am
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం…
రాజకీయాల్లో కొందరు నేతల తీరు విభిన్నంగా ఉంటుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంతదాకా అయినా వెళతారు. ఈ…
నిజమే… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యావత్తు రాష్ట్రాన్ని గెలిచారు. అదేంటీ… 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ…
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి సోమవారం మరో షాక్ తగిలింది. ఇప్పటికే గుంటూరు…
టాలీవుడ్లో దాదాపు 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు సీనియర్ నటుడు శివాజీ. కెరీర్ ఆరంభంలో సహాయ పాత్రలు చేసిన అతను..…
సాధారణంగా శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా పార్టీకి చెందిన సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తే మార్షల్స్ రంగ ప్రవేశం…