యువ కథానాయకుడు విశ్వక్సేన్ స్థాయిని పెంచిన సినిమా ‘హిట్’. అతడి కెరీర్లో తొలి సూపర్ హిట్ మూవీ కూడా ఇదే. అంతకుముందు అతను చేసిన వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్ సినిమాలు కమర్షియల్‌గా ఆశించినంత మంచి ఫలితాలు అందుకోలేదు. ‘హిట్’ మాత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గరా మంచి విజయం సాధించింది.
ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్లు దర్శకుడు శైలేష్ కొలను ప్రకటించగానే.. విశ్వక్‌నే హీరోగా ఊహించుకున్నారు అందరూ. ఇలాంటి ఫ్రాంఛైజీని విశ్వక్ ఎందుకు వదులుకుంటాడనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కానీ ఆశ్చర్యకరంగా అతను ‘హిట్-2’కు దూరమయ్యాడు. అతడి స్థానంలోకి థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టు అడివి శేష్ వచ్చాడు. దీని వల్ల సినిమాకు ఇంకా హైప్ వచ్చింది కానీ.. విశ్వక్ ఎందుకు ఈ ప్రాజెక్టుకు దూరమయ్యాడన్నదే ప్రశ్నగా మారింది.
విశ్వక్ వద్దనుకుని శేష్‌ను ఈ ప్రాజెక్టులోకి తీసుకుని ఉంటారనే ప్రచారం జరిగింది. ఐతే తనను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించలేదని, డేట్లు సర్దుబాటు చేయలేక తానే తప్పుకున్నానని విశ్వక్సేన్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను వరుసగా సినిమాలు కమిటై ఉన్నానని, వాటి మధ్య ‘హిట్-2’కు కాల్ షీట్లు ఇవ్వలేకే ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విశ్వక్ వెల్లడించాడు. ప్రస్తుతం ‘పాగల్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న విశ్వక్సేన్.. దీంతో పాటు ‘ప్రాజెక్ట్ గామి’ అనే సినిమాలోనూ నటించాడు.
త్వరలోనే అతను తమిళ హిట్ ‘ఓ మై కడవులే’ రీమేక్‌ను మొదలు పెట్టబోతున్నాడు. మరో కొత్త దర్శకుడి తోనూ ఓ కమిట్మెంట్ ఉందట. ఇన్ని సినిమాల మధ్య ‘హిట్-2’ చేయలేకపోయానని అతను వెల్లడించాడు. ‘పాగల్’ మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 29, 2021 9:27 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…