యువ కథానాయకుడు కార్తికేయకు అరంగేట్ర సినిమా ‘ఆర్ఎక్స్ 100’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే ముందు అతను ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా చేశాడు. ఆ పేరుతో ఓ సినిమా రిలీజైనట్లు కూడా చాలామందికి తెలియదు. ఐతే రెండో సినిమాగా చేసిన ‘ఆర్ఎక్స్ 100’ సంచలన విజయం సాధించడంతో అతను ఓవర్ నైట్ మంచి పాపులారిటీ సంపాదించాడు. చిన్న స్థాయి స్టార్ అయ్యాడు. అవకాశాలు వరుస కట్టేశాయి. ఐతే వీటిలో సరైనవి ఎంచుకోవడంలో కార్తికేయ తడబడ్డాడు. దెబ్బకు అరడజను ఫ్లాపులు అతడి ఖాతాలో పడ్డాయి.
తాజాగా ‘చావు కబురు చల్లగా’ కార్తికేయ కెరీర్లోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన చిత్రం అయింది. గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న బేనర్లో సినిమా అంటే.. కార్తికేయ హిట్టు కొట్టబోతున్నట్లే అని అంతా ధీమాగా ఉన్నారు కానీ.. ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు.
‘చావు కబురు చల్లగా’ తన కెరీర్‌కు పెద్ద దెబ్బ అయ్యేలా ఉందని కార్తికేయ కూడా అర్థం చేసుకున్నట్లున్నాడు. ప్రేక్షకులు తనపై ఆగ్రహం చూపించకుండా వాళ్లను మన్నించమని కోరుతూ ఒక ట్వీట్ వేశాడు. ముందుగా ఈ సినిమా నటుడిగా తనలో కొత్త కోణాన్ని బటయటికి తీసిందని, కొందరు ప్రేక్షకుల మనసుకు ఇది బాగా చేరువ అయిందని.. బస్తీ బాలరాజు పాత్ర చేసినందుకు తాను గర్విస్తున్నానని అతను పేర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా ఈ సినిమా నచ్చని అందరూ చిన్న తప్పులున్నా క్షమించాలని.. తనకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని కోరాడు.
కచ్చితంగా తన తప్పులను సరిదిద్దుకుని పుంజుకునే ప్రయత్నం చేస్తానని అతనన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ అయితే ప్రేక్షకుల మీద తమ అసహనాన్ని చూపించేవాళ్లూ ఉంటారు. దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఫెయిల్యూర్‌ను అంగీకరించి ప్రేక్షకుల నుంచి మన్నింపు కోరితే వారిలో సానుభూతి, సానుకూలత కనిపిస్తాయి. కార్తికేయ తెలివిగా ఆ పనే చేశాడు.
This post was last modified on March 29, 2021 5:16 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…