హీరోగా కెరీర్ ఆరంభంలో గట్టి ఎదురు దెబ్బలే తిన్నాడు రానా దగ్గుబాటి. ఐతే ఇలా హీరో వేషాలకే పరిమితం అయితే కెరీర్ ముందుకు సాగదని అర్థం చేసుకుని ప్రత్యేక పాత్రలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ‘బాహుబలి’ లాంటి అద్భుత చిత్రం అతడి చేతికొచ్చింది. ఇక అతను వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత ఎన్నో ప్రత్యేకమైన, సాహసోపేత పాత్రలు అతణ్ని వరించాయి.
ఇందులో ‘అరణ్య’ లీడ్ రోల్ కూడా ఒకటి. ఫారెస్ట్ మ్యాన్‌గా వివిధ భాషలకు పరిచయమున్న నటుడిని లీడ్ రోల్‌కు తీసుకోవాలనుకున్నపుడు ప్రభు సాల్మన్‌కు రానా కంటే మించిన ఛాయిస్ కనిపించలేదు. ఇలాంటి సినిమాలు అందరు నటులకూ లభించవు. రానాలా ఇలాంటి పాత్రల కోసం అందరూ కూడా అంత కష్టపడరు. ఈ రోజుల్లో పూర్తిగా అటవీ నేపథ్యంలో ఏనుగుల మధ్య చిత్రీకరణ చేయడమంటే మాటలు కాదు. ప్రకృతి, అడవి, ఏనుగులు, జీవ వైవిధ్యం.. ఈ నేపథ్యంలో ఒక కథను చెప్పాలనుకోవడం గొప్ప విషయం.
‘అరణ్య’ ట్రైలర్ చూస్తే ఒక గొప్ప సందేశంతో, ఎన్నో మంచి విషయాలతో ఈ సినిమా చేశారని అర్థమైంది. ఐతే ప్రేక్షకులకు ఇలాంటి ‘మంచి’ సినిమాల కంటే కూడా ఎంటర్టైనర్లే ఎక్కువ ఇష్టం. ఇలాంటి చిత్రాలకు ప్రోత్సాహం తక్కువే. రెండు వారాల కిందట ‘శ్రీకారం’ అనే మంచి సినిమా వచ్చింది. కానీ దానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదు. పక్కనే ‘జాతిరత్నాలు’ లాంటి ఎంటర్టైనర్ ఉంటే దానికి పట్టం కట్టారు.
ఈ వారం విషయానికొస్తే ‘అరణ్య’ కంటే కూడా ‘రంగ్ దె’ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మీదే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంది. దానికే బుకింగ్స్ బాగున్నాయి. మరోవైపు హాలీవుడ్ మూవీ ‘గాడ్జిల్లా వెర్సస్ కాంగ్’ నుంచి కూడా ‘అరణ్య’కు పోటీ తప్పట్లేదు. ఈ నేపథ్యంలో ‘అరణ్య’కు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.
‘జాతిరత్నాలు’ ఇంకా బాగా ఆడుతుండటం.. కొత్తగా మరో మూడు చిత్రాలు రేసులో ఉండటంతో సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు కూడా దక్కలేదు. ఇంకోవైపేమో ఉత్తరాదిన కరోనా ప్రభావం వల్ల ‘అరణ్య’ హిందీ వెర్షన్ రిలీజే ఆగిపోయింది. మొత్తంగా చూస్తే రానా అండ్ టీం ఎంతో కష్టపడి చేసిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అంత అనుకూల పరిస్థితులైతే లేవు. ఈ స్థితి నుంచి సినిమా మంచి ఫలితాన్నందుకోవాలంటే చాలా మంచి టాక్ రావాలి. మరి శుక్రవారం మధ్యాహ్నం ఈ సినిమా గురించి ఏం మాట్లాడుకుంటారో చూడాలి.
This post was last modified on March 25, 2021 6:04 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…