వర్మకు కంగన భలే ఇచ్చిందిగా..


రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్లో ఎవరో ఒకరిని గిచ్చడం అలవాటు. చురుక్కుమనేలా కామెంట్లు చేసి అవతలి వాళ్లను ఇరుకున పెడుతుంటాడు. ఆయన మాటల చాతుర్యానికి భయపడో.. లేక ఈయనతో పెట్టుకోవడం ఎందుకు అనో చాలామంది ఆయన ట్వీట్లకు బదులివ్వరు. ఒక ఫిలిం మేకర్‌గా వర్మ తన స్థాయిని కోల్పోయి చాలా కాలం అయింది. గత కొన్నేళ్లలో మరీ పతనం అయిపోయాడు. ఈ నేపథ్యంలో అందరూ ఆయన్ని ఇగ్నోర్ చేస్తున్నారు కూడా. దీంతో వర్మ ఎవరిని ఏ కామెంట్ చేసినా చెల్లిపోతోంది.

కానీ కంగనా రనౌత్ లాంటి విషయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆమె తన మీద ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకునే రకం కాదు. తన విషయంలో చమత్కారం చూపించినా కూడా వెంటనే కౌంటర్ వేసేస్తుంటుంది. తాజాగా ఆమె నటించిన ‘తలైవి’ ట్రైలర్ చూసి వర్మ ఒక ట్వీట్ వేశాడు. దానికి ఆమె తనదైన శైలిలో బదులిస్తూ వర్మకు కౌంటర్ వేసింది.

తలైవి ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ అని.. జయలలిత స్వర్గం నుంచి ఈ ట్రైలర్ చూసి థ్రిల్ అయి ఉంటుందని.. ఇందులో కంగనా సూపర్ డూపర్ స్పెషల్‌గా ఉందని కామెంట్ చేశాడు. అంత వరక బాగానే ఉంది కానీ.. కంగనా కొన్ని అంశాల్లో పరిమితికి మించి వెళ్లిపోతుందని.. ఆ విషయంలో తాను ఆమెతో ఏకీభవించనని నర్మగర్భమైన వ్యాఖ్య చేశాడు. దీనికి కంగనా తనదైన శైలిలో బదులిచ్చింది.

తాను వర్మతో ఏ విషయంలోనూ ఏకీభవించకపోవడం ఉండదని.. ఆయనంటే తనకు ఇష్టమని, చాలా విషయాల్లో ఆయన్ని అభినందిస్తానని పేర్కొంది. ఇగోలు రాజ్యమేలే ఈ ప్రపంచంలో వర్మ దేనికీ హర్టవడని.. అలాగే వర్మ ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోడని, చివరికి తనను తాను కూడా సీరియస్‌గా తీసుకోడని కంగనా పేర్కొంది. ఆయన కాంప్లిమెంట్లకు కృతజ్ఞతలని కూడా కంగనా వ్యాఖ్యానించింది. ఐతే వర్మ మరీ నాన్ సీరియస్ అని, తనను తాను సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల ఆయన స్థాయి పడిపోయిందని పరోక్షంగా కంగనా కౌంటర్ వేయడం గురించి సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. వర్మ పొగుడుతున్నట్లే ఆయనకు భలే కౌంటర్ వేసిందంటూ ఆమెను వర్మ వ్యతిరేకులు పొగుడుతున్నారు.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)