అల్లు అర్జున్ మోమెంట్ అకిరా దోచుకున్నాడు!

ఏప్రిల్ 8న అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, కొణిదెల అకిరానందన్ పుట్టినరోజు. మామూలుగానే ఈ రోజున సోషల్ మీడియా సందడి సందడిగా ఉంటుంది. అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అవడంతో అతని ఆర్మీ యమా గోల చేస్తున్నారు. ఈసారి ట్విట్టర్లో చిరంజీవి, చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఫాన్స్ కి మరిన్ని స్మృతులు  నెమరు వేసుకునే వీలు చిక్కింది.

అల్లు అర్జున్, అఖిల్ హీరోలయినా కానీ ఈసారి పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ సందడి ఎక్కువగా కనిపించింది. ఆరడుగుల నాలుగు అంగుళాల ఎత్తుండే అకిరానందన్ హైట్ అంతటా టాపిక్ అయింది. వరుణ్ తేజ్ కంటే కూడా ఎత్తున్నఅకిరా ఇవాళ అంతా బాగా ట్రెండ్ అయ్యాడు. అతనికి నటించాలనే కోరిక ఉందో లేదో తెలియదు కానీ పవన్ అభిమానులు మాత్రం ఫ్యూచర్ స్టార్ అంటూ భలే సందడి చేసారు.