Movie News

మంచి సినిమానే కానీ.. చూడట్లేదు

కొన్ని సార్లు కొన్ని సినిమాలకు మంచి టాక్ వస్తుంది. ‘మంచి సినిమా’ అన్న పేరొస్తుంది. రివ్యూలు బాగుంటాయి. సోషల్ మీడియాలో జనాలందూ సినిమా గురించి పాజిటివ్‌గానే మాట్లాడతారు. అయినా సరే.. జనాలు వాటిని ఆశించిన స్థాయిలో ఆదరించరు. ఈ కోవలోకే చేరేలా కనిపిస్తోంది ‘శ్రీకారం’ చిత్రం. శర్వానంద్ హీరోగా కొత్త దర్శకుడు కిషోర్ రూపొందించిన చిత్రమిది. 14 రీల్స్ ప్లస్ లాంటి పెద్ద బేనర్లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ పాజిటివ్‌గా కనిపించింది. పాటలు బాగున్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సినిమాకు రిలీజ్ ముంగిట డీసెంట్ బజ్ కనిపించింది. రిలీజ్ రోజు రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. వ్యవసాయం చుట్టూ నడిచే ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. దాన్ని చాలా హృద్యంగా చెప్పారు. కమర్షియల్ హంగులు కూడా బాగానే జోడించారు. అన్నీ బాగున్నా కానీ సినిమాకు వసూళ్లు మాత్రం లేవు.

‘జాతిరత్నాలు’తో పోటీ పడటం ‘శ్రీకారం’ చిత్రానికి చేటు చేసిందనడంలో సందేహం లేదు. ‘శ్రీకారం’తో పోలిస్తే అది చిన్న సినిమానే కానీ.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఓ పెద్ద సినిమా స్థాయిలో సత్తా చాటుతోంది. మంచి ఎంటర్టైనర్ అయిన ఆ సినిమా చూడ్డానికే ప్రేక్షకులు ఎగబడుతున్నారు. వీకెండ్లోనే ‘శ్రీకారం’కు సరైన ఆక్యుపెన్సీ లేకపోయింది. శని, ఆదివారాల్లో కూడా హౌస్ ఫుల్స్ పడలేదు. ఆక్యుపెన్సీ మరీ తక్కువగా ఉండటం ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మింగుడు పడలేదు.

అందుబాటులో మంచి ఎంటర్టైనర్ ఉండటంతో సినిమాలకు మహరాజ పోషకులైన యూత్ ‘శ్రీకారం’ వైపు చూడట్లేదని అర్థమవుతోంది. ఫ్యామిలీస్ కొంతమేర వీకెండ్లో ఈ సినిమాను చూశాయి. రూ.16 కోట్ల షేర్ రాబడితే కానీ ‘శ్రీకారం’ బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ వీకెండ్లో రూ.10 కోట్ల షేర్ కూడా వచ్చినట్లు కనిపించడం లేదు. వారాంతం అయ్యాక వసూళ్లు మరింత తగ్గుముఖం పడుతుండగా.. వచ్చే శుక్రవారం మూడు కొత్త చిత్రాలు వస్తున్న నేపథ్యంలో ‘శ్రీకారం’ బయ్యర్లను గట్టి దెబ్బే తీసేలా కనిపిస్తోంది.

This post was last modified on March 15, 2021 6:17 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

6 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

7 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

10 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

14 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

14 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

15 hours ago