‘కేజీఎఫ్’ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసే తొలి చిత్రం తమ హీరోతోనే అని చాలా ఆనందపడిపోయారు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. తారక్-ప్రశాంత్ కలయికలో సినిమాకు రంగం సిద్ధం చేసిన మైత్రీ మూవీ మేకర్స్ అప్పట్లో.. ఈ సినిమా గురించి అప్ డేట్ సైతం ఇచ్చింది.
కానీ ఊహించని విధంగా ప్రభాస్‌తో ‘సలార్’ మొదలుపెట్టేశాడు ప్రశాంత్. దీంతో తారక్‌తో అతడి సినిమా సంగతేంటని అభిమానులు టెన్షన్ పడిపోయారు. వారి ఆందోళనను తీర్చేస్తూ.. ఇటీవల ‘ఉప్పెన’ ప్రమోషన్ల సందర్భంగా తారక్-ప్రశాంత్ సినిమా తప్పక ఉంటుందని తేల్చారు మైత్రీ అధినేతలు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్టుపై సందేహాలు రేకెత్తించే పరిణామం జరిగింది.
ప్రశాంత్ నీల్ మంగళవారం గీతా ఆర్ట్స్ ఆఫీసుకు రావడం.. బన్నీతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది అనుకోకుండా జరిగిన పరిణామంలా లేదు. బన్నీతో సినిమా కోసమే కలిసినట్లు తెలుస్తోంది.
బన్నీ సినిమాల ప్లానింగ్ మామూలుగా ఉండదు. దర్శకుల ఎంపికలో పక్కాగా వ్యవహరిస్తుంటాడు. మిగతా హీరోల ఎదుగుదలను జాగ్రత్తగా గమనిస్తుంటాడు. ఎవరికీ తీసిపోని విధంగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటుంటాడు. వరుసగా త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ లాంటి అగ్ర దర్శకులతో అతను లైనప్ సెట్ చేసుకున్నాడు. ఐతే పాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే వీళ్లెవ్వరితోనూ పని కాదు. రాజమౌళినో, ప్రశాంత్ నీల్‌నో ఎంచుకోవాల్సింది. రాజమౌళితో ఇప్పుడిప్పుడే వర్కవుటయ్యేలా లేదు. కాబట్టి ప్రశాంత్ మీద అతడి కళ్లు పడ్డట్లున్నాయి. అందుకే తమ కలయికలో సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉంది.
ఐతే ఎన్టీఆర్‌తో చేశాక బన్నీతో ప్రశాంత్ సినిమా చేస్తే.. నందమూరి అభిమానులకు అభ్యంతరం లేదు. కానీ అనుకోకుండా వచ్చి పడ్డ ‘సలార్’ లాగే.. తారక్ ప్రాజెక్టును వెనక్కి నెట్టే బన్నీతో వేరే సినిమా చేస్తాడేమో అని ప్రశాంత్ మీద వారికి అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ను పూర్తి చేసి, త్రివిక్రమ్ సినిమాను ముగించేసరికి తారక్‌కు ఆలస్యం కావచ్చు. ఈ మధ్యలో ఖాళీ దొరికితే బన్నీ-ప్రశాంత్ సినిమా ఏమైనా సెట్ అయిపోతుందేమో అన్నది వారి భయం.
This post was last modified on March 10, 2021 2:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…