ప్రతి దర్శకుడికీ కొన్ని అభిరుచులు, ఆసక్తులు ఉంటాయి. బాగా ఆకర్షించే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని తమ సినిమాల్లో జొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ అభిరుచితోనే తమ సిగ్నేచర్ మార్క్ వేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ సిగ్నేచర్ కనిపించేది.. ప్రకృతి అందాల మధ్య సినిమా తీయడంతోనే. ఆయనకు అడవి అన్నా.. అక్కడి ప్రకృతి అందాలన్నా చాలా ఇష్టం. అలాగే అటవీ జంతువులన్నా కూడా మహా ప్రీతి. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకమైన కథలు ఎంచుకుని ప్రయాణం సాగిస్తుంటారు. అమలాపాల్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘ప్రేమఖైదీ’ ప్రభు సాల్మన్ తీసిన సినిమానే. ఆ చిత్రం చాలా వరకు కొండ కోనల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది. ప్రకృతి అందాలే సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ఇక ప్రభు కొడుకు విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ సాల్మన్ తీసిన ‘గుంకి’ సైతం అడవిని ఆనుకుని ఉండే ఒక పల్లెలో నడిచే సినిమా. ఇందులో హీరో మావటి. అతడి దగ్గరుండే ఏనుగు చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆ సినిమా చూస్తూ మనం మరిచిపోయిన మూలాల్లోకి వెళ్లిపోతాం.
ఇప్పుడు ఈ దర్శకుడు రానా హీరోగా ‘అరణ్య’ సినిమాను తెరకెక్కించాడు. అతడికి అడవి, అక్కడుండే జంతువులంటే ఎంతిష్టం అన్నది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. తన అభిరుచిని, ఆసక్తిని.. అలాగే అడవి, అక్కడి జంతువుల పట్ల తన ఆవేదనను ప్రభు సాల్మన్ ఎంతో హృద్యంగా చూపించినట్లున్నాడు. ఇందులో హీరో ఏనుగులను రక్షించే టార్జాన్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాపై ముందు పెద్దగా అంచనాల్లేవు కానీ.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూసి అందరిలోనూ ఒక కదలిక వచ్చింది. మనిషి తన స్వార్థం కోసం జంతువుల హక్కులను ఎలా కాల రాస్తున్నాడో ఈ సినిమాలా చాలా చక్కగా చర్చించినట్లున్నాడు దర్శకుడు. ట్రైలర్ చూసిన వాళ్లందరికీ ఇందులోని గొప్ప సందేశం బాగా అర్థమైంది. నేరుగా అది హృదయాలను తాకింది. ఇండియాలో ఇలా అటవీ నేపథ్యంలో ఇలాంటి సిన్సియర్ మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది. యూనివర్శల్ అప్పీల్ ఉన్న, మంచి కాజ్‌తో రూపొందించిన ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on March 5, 2021 5:09 pm
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…