టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు.. పరిశ్రమలో చాలామంది పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. సీనియర్ హీరోల్లో నాగార్జున, వెంకటేష్.. తర్వాతి తరం స్టార్లలో మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా చాలామంది స్టార్లతో ఆయన పని చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలన్న కోరికను సైతం ‘వకీల్ సాబ్’తో తీర్చుకుంటున్నారు. ఇక ఆయన బేనర్లో సినిమాలు చేయని బడా స్టార్లంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే.
చిరుతో భవిష్యత్తులో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదు కానీ.. బాలయ్యతో రాజుకు కాంబినేషన్ కుదరడంపై మాత్రం సందేహాలున్నాయి. ఎందుకంటే బాలయ్య ఇండస్ట్రీలో అందరితోనూ అంత కలివిడిగా ఉండరు. ఆయనతో అందరికీ అంత కంఫర్ట్‌గానూ ఉండదు. రాజుతో బాలయ్య ఎప్పుడూ అంత సన్నిహితంగా కనిపించింది లేదు. బాలయ్యతో సినిమా తీయడానికి కూడా రాజు ప్రయత్నించినట్లు ఎప్పుడూ వార్తలు రాలేదు.
ఐతే ఎట్టకేలకు వీరి కలయికలో ఓ సినిమా వచ్చే సూచనలున్నట్లు సమాచారం. రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌కు ఆస్థాన దర్శకుల్లో ఒకడిగా మారిపోయిన అనిల్ రావిపూడి ఈ కాంబినేషన్లో సినిమా వచ్చేలా చూస్తున్నాడట. ఇప్పటికే మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసినప్పటికీ.. బాలయ్యతో సినిమా తీయాలన్నది అనిల్ రావిపూడి కల. ఇంతకుముందే ‘రామారావు’ పేరుతో బాలయ్యతో ఓ సినిమా చేయడానికి అతను ప్రయత్నాలు చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయినా ప్రయత్నం ఆపలేదు. ఐతే ఎట్టకేలకు బాలయ్య అతడితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం బోయపాటితో సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమాను ఖరారు చేశాడు. ఇదయ్యాక అనిల్‌తోనే ఆయన జట్టు కడతాడట. ప్రస్తుతం ‘ఎఫ్-3’ తీస్తున్న అనిల్.. ఆపై మహేష్ బాబుతో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు. అదయ్యాక బాలయ్య సినిమాను మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఈ చిత్రాన్ని దిల్ రాజే నిర్మిస్తాడని.. త్వరలోనే దీని గురించి ప్రకటన రావచ్చని అంటున్నారు.
This post was last modified on March 5, 2021 10:36 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…