తెలుగు సినిమాలు ఎంతగా మారినా.. గతంతో పోలిస్తే ఎంత ప్రోగ్రెసివ్‌గా కనిపిస్తున్నా.. ఇక్కడ హీరోయిన్లకు ఉన్న ప్రాధాన్యం తక్కువే. వాళ్లకు ఎప్పుడో కానీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కవు. ఒక సినిమాతో మంచి నటి అని నిరూపించుకున్నా సరే.. తర్వాత మంచి పాత్రలే వస్తాయన్న గ్యారెంటీ ఏమీ లేదు.
‘తొలి ప్రేమ’ సినిమాతో రాశి ఖన్నా తన టాలెంట్ చూపించాక ఆమెకేమీ మంచి మంచి పాత్రలు వచ్చి పడిపోలేదు. ఇలాంటి ఇండస్ట్రీలో ఒక నటి తన ప్రతి సినిమాలో బలమైన పాత్ర చేస్తోందంటే.. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆమె పాత్ర హైలైట్ అవుతోందంటే.. గ్లామర్ కోసం కాకుండా కేవలం ఆ కథానాయిక నటన చూసేందుకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటే.. ఆమె కచ్చితంగా ఓ అరుదైన కథానాయికే అయ్యుండాలి. ఆ స్పెషల్ అమ్మాయి.. సాయిపల్లవి.
ఈ రోజు సాయిపల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న రెండు తెలుగు సినిమాలకు సంబంధించి తన స్పెషల్ లుక్స్ రిలీజ్ చేశారు. ఆ రెంటిలోనూ సాయిపల్లవి చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది. ఓవైపు ‘విరాటపర్వం’లో ఓ రెబలియన్ గర్ల్‌గా, మరోవైపు ‘లవ్ స్టోరి’లో పరిణతి కలిగిన ఉన్నత విద్యావంతురాలిగా నటిస్తోంది సాయిపల్లవి.
ఈ చిత్రాల రూపకర్తలు రిలీజ్ చేసిన పోస్టర్లు రెంటిలోనూ సాయిపల్లవి చాలా ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఆ పోస్టర్లు చూసి సాయిపల్లవి పాత్రల గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇలా హీరోయిన్ పుట్టిన రోజు రిలీజ్ చేసిన పోస్టర్లలో గ్లామర్ గురించి కాకుండా పాత్రల గురించి ఇలా చర్చించుకోవడం అంటే సాయిపల్లవి విషయంలో మాత్రమే జరుగుతుంది.
దక్షిణాదిన నయనతార, అనుష్క లాంటి వాళ్లు కూడా తిరుగులేని ఇమేజ్ సంపాదించారు, గొప్ప పాత్రలు చేశారు. కానీ సాయిపల్లవిలా ప్రతి సినిమాతో, ప్రతి పాత్రతో ప్రత్యేకత తెచ్చుకున్న వాళ్లు ఈ తరంలో మరొకరు కనిపించరు.
This post was last modified on May 9, 2020 2:50 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…