ఎన్నో ఏళ్లుగా చర్చలకే పరిమితం అవుతున్న సినిమా ‘బంగార్రాజు’పై ఇటీవల అక్కినేని నాగార్జున కీలక ప్రటకన చేశాడు. ఈ ఏడాదే, మరి కొన్ని నెలల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని, ఈ సినిమా ఎఫ్పుడు చేసినా సంక్రాంతికే విడుదల చేయాలన్నది తన అభిమతమని, ఈ సంక్రాంతికి అనుకుంటే కుదరలేదని, వచ్చే సంక్రాంతికి మాత్రం కచ్చితంగా సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నామని, ఏం జరుగుతుందో చూడాలని నాగ్ అన్నాడు.
ఐతే నాగ్ ఈ ప్రకటన చేయడానికి ముందే రెండు భారీ చిత్రాలు 2022 సంక్రాంతికి ఖరారయ్యాయి. మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ చాన్నాళ్ల కిందటే ఇచ్చారు. ఈ మధ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కూడా రేసులోకి వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్లో బిగ్గెస్ట్ స్టార్లు. వాళ్ల సినిమాలు ఎప్పుడూ ఇలా నేరుగా బాక్సాఫీస్ క్లాష్‌కు దిగింది లేదు. గతంలో ఇద్దరి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ కొంచెం గ్యాప్‌లో ఆ చిత్రాలు రిలీజయ్యాయి. కానీ ఈసారి ఒకట్రెండు రోజుల విరామంలో ఈ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. మామూలుగా వీళ్లలో ఒకరి సినిమా బరిలో ఉన్నా.. వేరే చిత్రాలను పోటీకి నిలపడడానికి భయపడతారు. అలాంటిది ఇద్దరి సినిమాలూ పోటీ పడుతున్నాయంటే వేరే వాళ్లకు ఛాన్స్ లేనట్లే.
ఐతే నాగార్జునకు ఈ విషయం తెలుసో లేదో కానీ.. తన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించేశాడు. ఐతే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు చాలా బాగా ఆడేస్తాయని, వేరే సినిమాలు ఎన్ని పోటీలో ఉన్నా ఇబ్బంది లేదని, 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ కంటే పెద్ద సినిమాలు రిలీజైనా అదే బాక్సాఫీస్ విజేతగా నిలిచింది కాబట్టి.. ‘బంగార్రాజు’కు కూడా మంచి ఫలితమే దక్కుతుందని ఆయన ధీమాగా ఉండొచ్చు. ఐతే ఇంతకీ అసలు ‘బంగార్రాజు’ ఈ ఏడాదైనా అనుకున్నట్లు పట్టాలెక్కి పూర్తయితే తర్వాత సంక్రాంతి రిలీజ్ సంగతి చూద్దామని అంటున్నారు టాలీవుడ్ జనాలు.
This post was last modified on March 3, 2021 10:38 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…