అల్లరి నరేష్ లేక లేక విజయాన్నందించిన చిత్రం ‘నాంది’. సోలో హీరోగా ఎనిమిదేళ్లుగా అతడికి సరైన విజయం లేదు. అతను సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లేమీ కోరుకోలేదు. తన సినిమా హిట్ అనిపించుకుంటే చాలనుకున్నాడు. కానీ ‘నాంది’ అంచనాల్ని మించిపోయి.. అతను కోరుకున్నదానికంటే పెద్ద విజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. బయ్యర్లందరికీ లాభాలు పంచుతోంది. అత్యాశకు పోకుండా నిర్మాత తక్కువ రేట్లకు సినిమాను ఇచ్చి మంచి పని చేశాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకోవడంతో డిజిటల్, శాటిలైట్, రీమేక్ రైట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేయడానికి ఇప్పటికే దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడని, హక్కులు కొనేశాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘నాంది’కి డిజిటల్ స్ట్రీమింగ్ డీల్ కూడా ఓకే అయిపోయిందట. తెలుగువారి ఓటీటీ ‘ఆహా’ ఈ చిత్రాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్‌ను మించి రేటు పలికాయట డిజిటల్ రైట్స్ రూ.2.25 కోట్లకు ‘నాంది’ హక్కులను దక్కించుకుందట ఆహా. ఈ సినిమాకు ఇది పెద్ద రేటే. ఐతే ఉన్న సబ్‌స్క్రైబర్లను నిలబెట్టే, కొత్త సబ్‌స్క్రిప్షన్లు పెంచే సత్తా ఉన్న ‘నాంది’కి ఆ రేటు పెట్టడం ఎక్కువేమీ కాదని ఆహా వారు భావించారట.
ఈ చిత్రాన్ని మార్చి మధ్యలో స్ట్రీమింగ్ చేయాలని ఆహా టీం నిర్ణయించినట్లు సమాచారం. మొత్తానికి ‘నాంది’ అన్ని రకాలుగా మంచి ఆదాయమే తెచ్చిపెడుతోంది. నిర్మాత పంట పండినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రం అన్ని మార్గాల్లో కలిపి రూ.10 కోట్లకు అటు ఇటుగా ఆదాయం తెచ్చి పెడుతుందని అంచనా. సినిమాను రూ.2 కోట్ల బడ్జెట్లో తీసినట్లు చెబుతన్నారు. దీన్ని బట్టే నిర్మాత లాభమెంతో అంచనా వేయొచ్చు. నరేష్‌తో పాటు కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల కెరీర్లకు ఈ సినిమా ఎంత మేలు చేస్తుందో చెప్పేదేముంది?
This post was last modified on February 27, 2021 3:50 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…