నేచురల్ స్టార్ నాని కెరీర్లో ఎన్నో భిన్నమైన సినిమాలు చేశాడు. కొత్త కథలతో ప్రయాణం సాగించాడు. కానీ ఒక్క విషయంలో మాత్రం అతడిపై అప్పుడప్పుడూ విమర్శలు వస్తుంటాయి. లుక్ పరంగా పెద్దగా మార్పు ఉండదని.. ఎక్కువగా పక్కింటి అబ్బాయి లుక్‌లోనే కనిపిస్తుంటాడని అంటుంటారు జనాలు. ‘జెండాపై కపిరాజు’, ‘కృష్ణార్జున యుద్ధం’ లాంటి సినిమాల్లో కొంచెం మార్పు చూపించాడు కానీ.. అవి మినహాయిస్తే చాలా వరకు ఒకే లుక్ మెయింటైన్ చేస్తూ వస్తుంటాడు నాని. అతణ్ని భిన్నమైన అవతారాల్లో చూడాలని అభిమానులు కూడా కోరుకుంటారు.
ఐతే నానితో పని చేసే దర్శకులు అతడికి ఆ అవకాశం ఇవ్వట్లేదు. అతను చేసే కథల్లో చాలా వరకు మధ్య తరగతి అబ్బాయి పాత్రలే ఉంటుండటంతో లుక్ పరంగా వైవిధ్యం చూపించడానికి అవకాశం లేకపోయింది. ఐతే చాన్నాళ్ల తర్వాత నాని కొత్తగా కనిపించే అవకాశాన్ని ‘శ్యామ్ సింగ రాయ్’ ఇవ్వబోతోందని ఈ చిత్ర ఫస్ట్ లుక్ చూస్తే స్పష్టం అయింది.
నాని చేస్తున్న తొలి పీరియడ్ మూవీ ఇది. కొన్ని దశాబ్దాల వెనుకటి నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. కోల్‌కతా బ్యాక్ డ్రాప్ కావడం, పాత్ర పేరు కూడా శ్యామ్ సింగ రాయ్ కావడంతో నాని లుక్ మార్చడానికి అవకాశం వచ్చింది. 70లు, 80ల్లో బెంగాలీల వేషధారణ ఎలా ఉండోదో బాగా స్టడీ చేసి నాని పాత్రను తీర్చిదిద్దినట్లున్నాడు దర్శకుడు రాహుల్ సంకృత్యన్. డ్రెస్సింగ్, హేర్ స్టైల్, మీసం.. ఇలా ప్రతిదీ మార్చుకుని సరికొత్త అవతారంలోకి మారిన నాని.. అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. నానీని ఇలాంటి అవతారంలో చూస్తామని ఎవ్వరూ అనుకోలేదు.
నానికి చాలా అవసరమైన మేకోవర్ ఇదని ‘శ్యామ్ సింగ రాయ్’ ఫస్ట్ లుక్ చూసిన వాళ్లు అభిప్రాయపడుతున్నారు. నటన పరంగా కూడా వైవిధ్యం చూపించడానికి నానికి ఈ సినిమా మంచి అవకాశం ఇచ్చినట్లే ఉంది. సరిగా తీస్తే ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యే కెపాసిటీ ఉన్న సినిమాగా ‘శ్యామ్ సింగ రాయ్’ గురించి చెబుతున్నారు. మరి ఈ చిత్రం నాని ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on February 25, 2021 6:01 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…