Movie News

మళ్లీ టార్గెట్ అయిన తమన్

కెరీర్లో చాలా ఏళ్ల పాటు ఒక మూసలో సాగిపోయిన సంగీత దర్శకుడు తమన్.. గత కొన్నేళ్లలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని సంగీతాభిమానుల మనసు దోచాడు. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో అతనెంత సంచలనం రేపాడో తెలిసిందే. ఈ సినిమా పాటలు సోషల్ మీడియాను హోరెత్తించేశాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశవ్యాప్తంగా ‘అల వైకుంఠపురములో’ పాటు మార్మోగాయి.

ఈ సినిమా ఒకటే కాదు.. గత కొన్నేళ్లలో తమన్ నుంచి వచ్చిన చాలా ఆడియోలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. అతడి మీద ఒకప్పటి అభిప్రాయాలు మారేలా చేశాయి. ఐతే ఒకప్పటితో పోలిస్తే తమన్ మీద సోషల్ మీడియా దాడి తగ్గినప్పటికీ.. అప్పుడప్పుడూ అతను టార్గెట్ అవుతూనే ఉంటాడు. ‘అరవింద సమేత’ సినిమాకు తమన్ గొప్ప ప్రశంసలు అందుకుంటున్న సమయంలోనే ‘పెనివిటి’ పాట.. అతడి పాత పాటల తరహాలోనే ఉందంటూ విమర్శలూ తప్పలేదు.

తాజాగా తమన్ మరోసారి ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తన పాటనే రిపీట్ చేశాడంటూ తమన్ మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ పడుతున్నాయి. ‘టక్ జగదీష్’ టీజర్లో బ్యాగ్రౌండ్లో వినిపించిన పాటే ఈ విమర్శలకు కారణం. ఈ టీజర్లో ‘ఏటికొక్క పూట.. యానాది పాట..’ అంటూ లేడీ వాయిస్‌తో ఓ పాట ప్లే అయిన సంగతి తెలిసిందే. మామూలుగా చూస్తే అది కొత్తగానే అనిపిస్తోంది.

కానీ ఈ పాట ఆరంభం కాగానే జనాలకు ‘అల వైకుంఠపురములో’లోని సిత్తరాల సిరపడు సాంగ్ గుర్తుకొస్తోంది. దాదాపుగా అదే ట్యూన్‌ను తమన్ రిపీట్ చేసేశాడనిపిస్తోంది. కాకపోతే అందులో మేల్ వాయిస్ ఉంటే.. ఇందులో లేడీ వాయిస్ ఉంది. అంతే తేడా. మిగతా పాట స్టయిల్ మొత్తం దాన్నే తలపిస్తోంది. సౌండ్స్ అన్నీ రిపీట్ అయినట్లే ఉన్నాయి. దీంతో తమన్ తన ట్యూన్లను తనే కాపీ కొట్టడం మానడా అంటూ నెటిజన్లు అతడిని విమర్శిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో తమన్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నది వాస్తవం.

This post was last modified on February 24, 2021 6:56 pm

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

10 hours ago