ఒకప్పుడైతే 60 ఏళ్లు పైబడ్డ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి హీరోలు తమ వయసులో సగం కంటే తక్కువ, మూడో వంతున్న హీరోయిన్లతో కూడా ఎంచక్కా ఆడిపాడేశారు. అప్పటి ప్రేక్షకులు కూడా ఆ జోడీలను అంగీకరించారు. వయసు అంతరం గురించి అప్పుడు పెద్ద చర్చ కూడా ఉండేది కాదు. అప్పట్లో సోషల్ మీడియా కూడా ఉండేది కాదు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకపోయింది. కానీ ఇప్పుడు మరీ చిన్న వయసు హీరోయిన్లతో సీనియర్ హీరోలు జత కట్టాలంటే ఆలోచిస్తున్నారు. యంగ్ హీరోయిన్లతో సీనియర్లు రొమాన్స్ చేస్తే సోషల్ మీడియా జనాలు ఊరుకోరు.
ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమైపోతోంది. ఐతే అనివార్య పరిస్థితుల్లో సీనియర్ హీరోలు కొన్నిసార్లు యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేయక తప్పట్లేదు. మాస్ రాజా రవితేజ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. తాజాగా ‘క్రాక్’ సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రుతి హాసన్‌తో ఆడి పాడాడు రవితేజ.
కానీ మాస్ రాజా చేయబోయే రెండు కొత్త సినిమాలకు యంగ్ హీరోయిన్లనే తీసుకున్నారు. ఆ హీరోయిన్లందరూ కూడా రవితేజ వయసులో సగం కంటే తక్కువ ఉన్న వాళ్లే. ‘ఖిలాడి’లో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి అనే యంగ్ హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లే చిన్నవాళ్లంటే.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ చేయబోయే మరో కొత్త చిత్రానికి ఇంకా వయసు తక్కువ హీరోయిన్లను తీసుకున్నారు.
తమిళ కథానాయిక ఐశ్వర్యా మీనన్‌తో పాటు కన్నడ అమ్మాయి శ్రీలలను ఈ చిత్రానికి కథానాయికలుగా ఎంచుకున్నారట. ఐశ్వర్య వయసు 25 ఏళ్లు. చూడ్డానికి అంత వయసున్నట్లు కూడా కనిపించదు. రవితేజ పక్కనే ఈమెనే చాలా చిన్నదిగా కనిపించే అవకాశముంది. అలాంటిది శ్రీలీల వయసు మరీ 19 ఏళ్లే కావడం గమనార్హం. అంటే మాస్ రాజా వయసులో మూడో వంతు కంటే తక్కువ అన్నమాట. ఇంత చిన్న అమ్మాయిని రవితేజ పక్కన చూసి ప్రేక్షకులు ఎలా ఫీలవుతారో ఏమో?
This post was last modified on February 23, 2021 3:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…