పవర్ స్టార్ పవన్ సినిమా కెరీర్లో రీమేక్‌లు చాలానే ఉన్నాయి. ఆయన రీఎంట్రీ మూవీ హిందీ మూవీ ‘పింక్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దీని కంటే ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రం ‘కాటమరాయుడు’. తమిళంలో అజిత్ హీరోగా ‘శౌర్యం’ శివ రూపొందించిన చిత్రమిది. అక్కడ పెద్ద విజయమే సాధించింది. ఈ చిత్రాన్ని హిందీలోనూ పునర్నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ముందు అక్షయ్ హీరోగా ‘ల్యాండ్ ఆఫ్ లుంగి’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఏమైందో ఏమో.. ఆ సినిమా ముందుకు కదల్లేదు. కాగా ఇప్పుడు సల్మాన్ హీరోగా ‘వీరం’ను రీమేక్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సల్మాన్ హీరోగా ‘కబీ ఈద్ కబీ దివాలి’ పేరుతో గత ఏడాదో ఓ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇది ‘వీరం’ రీమేక్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తుండటం విశేషం.
‘కబీ ఈద్ కబీ దివాలి’ దర్శకుడు ఫర్హద్ సామ్‌జీ ‘కాంఛన’ సహా కొన్ని సౌత్ రీమేక్‌లకు పని చేశాడు. అతను ‘వీరం’ సినిమాకు బాలీవుడ్ టచ్ ఇచ్చి ‘కబీ ఈద్ కబీ దివాలి’ పేరుతో సల్మాన్ హీరోగా సినిమా తీయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘రాధే’ను పూర్తి చేసి ‘అంతిమ్’ను ముగించే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత అతను హీరోగా నటించాల్సిన సినిమాలు టైగర్-3, కబీ ఈద్ కబీ దివాలి. ఈ ఏడాది చివర్లో ‘కబీ ఈద్ కబీ దివాలి’ పట్టాలెక్కనుంది.
‘వీరం’ను తెలుగులో తీస్తే వర్కవుట్ కాలేదు. బాలీవుడ్ వాళ్లు సౌత్ నుంచి కథలు తీసుకుంటారు కానీ.. వాటి స్వరూపమే మార్చేస్తారు. సల్మాన్ కూడా ఇక్కడి కథలు చాలానే ఎంచుకుని నటించాడు. వాటికి, మాతృకలకు పెద్దగా పోలికలుండవు. మరి ‘వీరం’ను బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఎలా మారుస్తారో.. అక్కడీ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
This post was last modified on February 15, 2021 6:08 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…