ఒక డైరెక్టర్ సక్సెస్ లో ఉండగా హీరోని కలిస్తే అతనేమీ చెప్తే అది హీరో చేస్తాడు. అదే ప్లాప్ ఇచ్చిన తర్వాత హీరోని కలిస్తే మాత్రం హీరో చెప్పింది చేయాలి. చరణ్ దగ్గరకు కథ పట్టుకెళ్లిన సాహో దర్శకుడు సుజీత్ అలాగే ఇప్పుడు చరణ్ చెప్పినట్టుగా లూసిఫెర్ రీమేక్ మీద వర్క్ చేస్తున్నాడు.
చిరంజీవితో చేసే ఈ రీమేక్ కోసం సుజీత్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడు. అలాగే వేంకటాద్రి ఎక్స్ప్రెస్ దర్శకుడు మేర్లపాకగాంధీ కృష్ణార్జున యుద్ధం అనే ప్లాప్ తర్వాత నితిన్ ని కలిసాడు. ఆటను చెప్పిన కథ పక్కన పెట్టి అందాధూన్ రీమేక్ చేయమని నితిన్ అతనికి అప్పగించాడు. హీరోతో రిలేషన్ పోగొట్టుకోలేరు కనుక డైరెక్టర్స్ వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు.
ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే అప్పుడు వారికి హీరో ఇంకో ఛాన్స్ ఇస్తాడనేది వాళ్ళ నమ్మకం. రీమేక్ సినిమాలకి గతంలో మాదిరిగా ఇప్పుడు అంత క్రేజ్ లేదు. ఓటిటీ వల్ల వాటిని జనం ముందే చూసేస్తున్నారు కనుక దర్శకులు రీమేక్స్ పై ఆసక్తిగా లేరు. అందుకే హీరోలు ఇలాంటి డైరెక్టర్స్ కి ఆ పని అప్పగిస్తున్నారు.