మెగాస్టార్ చిరంజీవితో పని చేయాలని సౌత్ ఇండియాలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా మెజారిటీ దర్శకులు ఆశ పడే వాళ్లే. ఆయనతో సినిమా అంటే దాన్ని గొప్ప అవకాశంగా భావిస్తారు పెద్ద పెద్ద దర్శకులు కూడా.
వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన కొరటాల శివ సైతం చిరుతో సినిమా అనేసరికి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో తెలిసిందే. చిరంజీవి ప్రస్థానం అంత గొప్పది. ఆయన స్థాయి అలాంటిది. అలాంటి చిరు ఓ దర్శకుడితో పని చేయాలని ఎంతో తపించారు. బహిరంగంగానే ఆ కోరికను వ్యక్తపరిచారు కూడా. కానీ ఆ కోరిక మాత్రం నెరవేర్చుకోలేకపోయారు. చిరును అంతగా ఊరించిన ఆ దర్శకుడు మరెవరో కాదు.. శంకర్.
దర్శకుడిగా తన తొలి చిత్రం ‘జెంటిల్‌మ్యాన్’తోనే శంకర్ తనపై అంచనాల్ని భారీగా పెంచేశాడు. ఆ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన చిరు.. దాని హిందీ రీమేక్‌లో నటించడం విశేషం. ఆ తర్వాత శంకర్‌తో నేరుగా పని చేయాలని చిరు అనుకున్నారు.
కానీ ఈ కాంబినేషన్ కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ.. వర్కవుట్ కాలేదు. ఆ మధ్య ‘రోబో’ సినిమా ఆడియో వేడుకలో చిరు శంకర్ మీద ప్రశంసలు కురిపించి, అతడిపై తన అభిమానాన్ని చాటుకుని, తనతో సినిమా చేసే అవకాశం ఇవ్వాలని ఓపెన్‌గా రిక్వెస్ట్ చేయడం విశేషం.
ఆ సందర్భంగా చిరుతో పని చేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని, తప్పకుండా అందుకోసం ప్రయత్నిస్తానని శంకర్ అన్నాడు. కానీ ఎప్పుడూ తమిళ స్టార్ల మీదే దృష్టి పెట్టే శంకర్.. తెలుుగలో చిరునే కాదు, మరే హీరోతోనూ కూడా పని చేయలేదు. ఐతే ఇప్పుడు శంకర్.. చిరు తనయుడు రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్త బయటికి వచ్చింది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.
ఇందుకోసమే ఆయన చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. డీల్ దాదాపు ఓకే అయినట్లే అని.. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి ఘనంగా ప్రకటన చేస్తారని అంటున్నారు. మొత్తానికి చిరు కోరిక తీరకున్నా.. ఆయన తనయుడు శంకర్‌తో పని చేయబోతుండటం విశేషమే.
This post was last modified on February 11, 2021 10:54 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…