రష్మిక డిమాండ్ కి కరోనా బ్రేక్!

సరిలేరు నీకెవ్వరు హిట్ అవడంతో రష్మికకు టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించనున్న రష్మికకు మునుపటి కంటే ఎక్కువ పారితోషికం కూడా ఆఫర్ చేసారు. అయితే కరోనా సంక్షోభం వల్ల చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగా దెబ్బ తినడంతో ఇకపై అందరి పారితోషికాలు తగ్గుతాయి.

ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, హీరోయిన్ల పారితోషికాలలో భారీ మార్పులు జరగనున్నాయి. ఇందుకోసం హీరోలు కూడా ఇప్పటికే తమ సమ్మతం తెలిపినట్టు వినిపిస్తోంది. రష్మిక కూడా అగ్ర హీరోయిన్ కనుక ఆమె కూడా పారితోషికం తగ్గించుకోక తప్పదు. సరిగ్గా పారితోషికం పెరిగే సమయానికి ఇలా కరోనా క్రైసిస్ రావడం, తన పారితోషికంపై కోత పడడం పాపం బాధాకరమే.