రామ్ చరణ్ 17 కోసం అడుగులు మొదలయ్యాయి. పూజా కార్యక్రమాలు ఆల్రెడీ చేసినప్పటికీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. ప్రస్తుతం చరణ్ మేకోవర్ లో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఈ ప్యాన్ ఇండియా మూవీలో నటించేందుకు క్యాస్టింగ్ పిలుపు ఇచ్చారు సుకుమార్. 16 నుంచి 60 సంవత్సరాల వరకు ఉత్సాహం, ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తమను సంప్రదించాలని వాట్సప్ నెంబర్, ఈమెయిల్ అడ్రెస్ ని సోషల్ మీడియాలో ప్రకటించారు.
బహుశా ఇంత పెద్ద క్యాస్టింగ్ కాల్ ఇవ్వడం సుకుమార్ కు ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసిన వాటిలో హీరోయిన్లు మినహాయిస్తే ఆర్టిస్టులు కొత్తగా పరిచయమైన వాళ్ళు తక్కువే. ఈసారి ఇంతమందిని పిలుస్తున్నారంటే మ్యాటర్ ఏదో స్ట్రాంగ్ గానే ఉందన్న మాట. ఎంపికైన వాళ్లకు ఆడిషన్లు నిర్వహించబోతున్నారు. ఇదంతా సుకుమార్ స్వయంగా పర్యవేక్షించి ఎంపిక చేసుకోబోతున్నారు. టాలెంట్ ఉన్న ఎవరికైనా జాక్ పాట్ తగిలితే పెద్ద క్యారెక్టరే పట్టొచ్చు.
క్యాస్టింగ్ కబుర్లు కాసేపు పక్కనపెడితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఒకసారి సాత్విక వీరవల్లి, ఇంకోసారి భాగ్యశ్రీ బోర్సే, మరోసారి అనీఖా సురేంద్రన్ అంటూ ఇలా రకరకాల పేర్లు బయటికి వస్తున్నాయి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారనేది సస్పెన్స్ గానే ఉంది. ఇది తేలితే తప్ప హీరో హీరోయిన్ కు సంబంధించిన ఎపిసోడ్లను తీయలేరు. విడుదల 2028 టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఒత్తిడి లేదు కానీ వీలైనంత త్వరగా ఈ తతంగం పూర్తి చేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది.
అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చబోతున్న ఆర్సి 17 ఏ జానర్ లో రూపొందుతోందనేది గుట్టుగా ఉంచుతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ లో నెమలీకను చూపించడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. లీకైన సోర్స్ ప్రకారం ఈ సినిమా నగర నేపథ్యంలోనే ఉంటుందట. రంగస్థలం, పుష్ప లాగా పల్లెటూరికి పరిమితం కాకుండా ఈసారి సిటీలో తీస్తారని వినికిడి. పెద్ది అనుకున్నంత ఫలితం ఇవ్వకపోవడంతో రామ్ చరణ్ తో పాటు ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ రంగస్థలం కాంబినేషన్ మీదే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates