స్టేజ్ ఎక్కి మాట్లాడినా.. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా చాలా కూల్‌గా మాట్లాడుతుంటాడు దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్. ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ కనిపించే అతను.. తన కొత్త చిత్రం ఈఎన్ఈ రిపీట్ సక్సెస్ మీట్‌లో ఒక్కసారిగా ఫైర్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరి మాటలు హర్ట్ చేశాయో ఏమో కానీ… తనను చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారని, తనేంటో చూపిస్తానని, డ్యూటీ ఎక్కుతానని.. ఇకపై దిగేది లేదని తరుణ్ ఛాలెంజ్ విసరడం విశేషం.
చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అంటూ ఒకటికి రెండుసార్లు చెప్పిన తరుణ్.. తన సినిమాల్లో ఎప్పుడూ డబ్బు ముఖ్యం కాదు, డబ్బుకు విలువ లేదు అనే చెబుతుంటానని, కానీ ఇకపై తనకు డబ్బే ముఖ్యం అని వ్యాఖ్యానించాడు. ఇకపై డబ్బునే ఫాలో అవుతా, అందరూ లైన్లో నిలబడాలి.. అంటూ ఆవేశంగా మాట్లాడాడు తరుణ్.
ఎ, బి, సి అని తేడా లేకుండా అన్ని సెంటర్ల వాళ్లనూ టార్గెట్ చేస్తూ తాను సినిమాలు చేస్తానని.. ఇకపై తాను సీరియస్‌గా డ్యూటీ ఎక్కుతానని, దిగే ప్రసక్తే లేదని తరుణ్ స్పష్టం చేశాడు.
తనకు ఎవరూ లేరని, తన వెంట ఉన్నది ప్రేక్షకులే అని.. రజినీకాంత్ ఆండవన్ ఇరుక్కార్ (దేవుడు ఉన్నాడు) అని డైలాగ్ చెప్పినట్లు, తనకు ప్రేక్షకులు ఉన్నారని చెబుతానని.. తన మీద వాళ్లు ఎంతో ప్రేమ చూపించారని.. వాళ్ల కోసమే సినిమాలు తీస్తానని తరుణ్ అన్నాడు.
డైరెక్టర్‌గానా, నటుడిగానా అన్నది పక్కన పెడితే.. తాను చెప్పాలనుకున్నది బలంగా చెబుతానని, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తానని తరుణ్ అన్నాడు. బయట ఏదైనా తప్పు చేసినా, సినిమాలో దాన్ని కరెక్ట్ చేస్తానని కూడా తరుణ్ అన్నాడు.
పదేళ్లకు పైగా కెరీర్లో తరుణ్ దర్శకుడిగా నాలుగు సినిమాలే తీశాడు. కొంచెం గ్యాప్ తర్వాత ఈఎన్ఈ రిపీట్ సినిమాతో తరుణ్ పెద్ద హిట్టు కొట్టాడు. ఈ సినిమా చూసిన చాలామంది తరుణ్ గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేయాలని కోరుకున్నారు. అదే సమయంలో ఈ సినిమాను కొందరు తక్కువ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తరుణ్ రెగ్యులర్‌గా సినిమాలు తీసి తనేంటో చూపించాలని ఫిక్సయినట్లు కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates