పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరుమీదున్నాడిప్పుడు. కరోనా విరామం తర్వాత ఆయన శరవేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ను అవగొట్టేశాడు. వెంటనే మధ్యలో ఆపేసిన క్రిష్ సినిమాను పున:ప్రారంభించాడు. ఆ సినిమాతో సమాంతంరంగా ఇప్పుడు మరో చిత్రాన్ని లైన్లో పెట్టాడు. అదే.. అయ్యప్పనుం కోషీయుం రీమేక్. అనౌన్స్‌మెంట్ ఆలస్యంగా జరిగింది కానీ.. ఈ చిత్రం ముందు లైన్లో ఉన్న సినిమాలను వెనక్కి నెట్టేసేలాగే కనిపిస్తోంది. దీని తర్వాతే క్రిష్ సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రం పూర్తయ్యాక కానీ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్లోకి వచ్చేలా లేవు. పవన్ కెరీర్లోనే అత్యంత వేగంగా పూర్తి చేయబోయే సినిమాగా దీన్ని చెబుతుండటం విశేషం. సోమవారమే ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లిన సంగతి తెలిసిందే.
అసలే రీమేక్. పైగా త్రివిక్రమ్ పక్కాగా స్క్రిప్టు రెడీ చేసి ఇచ్చాడు. పవన్‌తో పాటు రానా అవసరమైన మేర డేట్లు సర్దుబాటు చేసి ఇచ్చారు. ఎక్కువ లొకేషన్లు అవసరం లేదు, విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. చాలా వరకు సెట్టింగ్స్‌లోనే సినిమా అయిపోతుంది. దీంతో అన్నీ పక్కాగా రెడీ చేసుకుని శరవేగంగా సినిమాను పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేసుకుందట చిత్ర బృందం. మూణ్నాలుగు నెలల్లోనే ఈ సినిమా అయిపోతుందని అంటున్నారు. అంతే కాదు.. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఓకే అయినట్లు చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నారట.
వేసవికి ఆల్రెడీ షెడ్యూల్ ప్యాక్డ్‌గా కనిపిస్తోంది. పైగా ఆ సీజన్లో పవన్ సినిమానే అయిన ‘వకీల్ సాబ్’ వస్తోంది. దసరా, దీపావళికి వేరే భారీ చిత్రాలున్నాయి. కాబట్టి మధ్యలో ఖాళీ ఉన్న ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను పవన్ తీసుకోబోతున్నాడట. మంచి రిలీజ్ డేట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో త్వరలోనే ఆగస్టు 15న తమ చిత్రం విడుదలవుతుందని కర్చీఫ్ వేసేయనుందట సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ.
This post was last modified on January 26, 2021 4:12 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…