టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పటాస్ సినిమాతో అనిల్‌ను దర్శకుడిగా పరిచయం చేసింది నందమూరి కళ్యాణ్ రామ్ అయినప్పటికీ.. ఆ తర్వాత అతను వరుసగా సినిమాలు చేసింది దిల్ రాజు బేనర్లోనే. ఆ సంస్థకు అతను ఆస్థాన దర్శకుడిగా మారిపోయాడు. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3.. ఇలా వరుసగా ఆ సంస్థలో సినిమాలు చేసిన అనిల్, మధ్యలో భగవంత్ కేసరి మూవీని మాత్రం షైన్ స్క్రీన్స్‌కు చేశాడు.
తిరిగి దిల్ రాజు ప్రొడక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం చేసి.. గత సంక్రాంతికి గేమ్ చేంజర్‌తో కుదేలైపోయిన దిల్ రాజును పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశాడు. ఇక ఈ సంక్రాంతికి షైన్ స్క్రీన్ బేనర్లోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేశాడు అనిల్. ఇప్పుడు జనవరి 12 విడుదల కూడా ఆ బేనర్‌లోనే తీస్తున్నాడు.
ఐతే ఈ బ్రేక్ తర్వాత అనిల్ తీసే తర్వాతి సంక్రాంతి సినిమాను తన బేనర్లో చేసుకోవాలని దిల్ రాజు ఆశపడ్డారు. మొన్న రామాయణం, సీన్ సినిమాలకు సంబంధించిన సక్సెస్ ప్రెస్ మీట్లో రాజు ఈ విషయం వెల్లడించారు 2028 సంక్రాంతికి అనిల్ డైరెక్షన్లో తాను సినిమా ఇవ్వబోతున్నట్లు ప్రకటించేశారు. హీరో ఎవరన్నది ఇంకా డిసైడవ్వలేదని ఆయన చెప్పారు. రాజు.. పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా కోసం ట్రై చేస్తున్న నేపథ్యంలో అనిల్ డైరెక్షన్‌లో ఆ చిత్రాన్ని సెట్ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ అనూహ్యంగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్ చేశాడు. ఆ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తాడని కూడా వెల్లడైంది. ఫొటోలో తారక్, అనిల్‌లతో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఉన్నాడు. ఆ సినిమాను 2028 సంక్రాంతికి అనుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అలాంటపుడు దిల్ రాజు.. అనిల్‌తో ప్రకటించిన సినిమా సంగతేంటి అన్నది ప్రశ్న.
అనిల్, తారక్, కళ్యాణ్ రామ్‌లతో దిల్ రాజు కూడా చేతులు కలిపి ఈ సినిమాలో సైడ్ పార్ట్‌నర్ అవుతాడా.. లేక దీంతో సంబంధం లేకుండా అనిల్‌తో వేరే సినిమా చేయించుకుంటాడా అన్నది ప్రశ్న. వేరే సినిమా ఉన్నట్లయితే రాజు అన్నట్లు 2028 సంక్రాంతికి ఆ సినిమా లేనట్లే. లేదంటే తారక్, అనిల్ సినిమాలోనే భాగస్వామిగా మారి చెప్పినట్లే 2028 సంక్రాంతికి సినిమాతో పలకరిస్తాడా అన్నది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates