ఇటీవలే విడుదలైన ఇట్లు అర్జున కి పర్లేదనే టాక్ వచ్చింది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు భారీ ఎత్తున మద్దతిచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పిలిచి వీడియో బైట్ ఇస్తే, రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా వచ్చి సపోర్ట్ అందించాడు. సమర్పకుడిగా ఉన్న నాగార్జున వీలైనంత వరకు ప్రతి ఈవెంట్ లో తన హాజరు ఉండేలా చూసుకున్నారు. మాములుగా ప్రీమియర్లకు దూరంగా ఉండే వెంకటేష్ సైతం ముందు రోజు వేసిన స్పెషల్ షో కోసం ఏఎంబి మల్టీప్లెక్సుకి రావడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది.
ఇదంతా ఎలా ఉన్నా ఇట్లు అర్జున బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయలేకపోతోంది. ఇంత భారీ బడ్జెట్, ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉన్న కంటెంట్ ఇవన్నీ భారీ వసూళ్లుగా కన్వర్ట్ కావడం లేదు. కలెక్షన్ల కోణంలో చూసుకుంటే కొత్త కుర్రాడికి ఇది డీసెంట్ లాంచ్ అని చెప్పొచ్చు కానీ జరిగిన హడావిడికి, వస్తున్న ఫలితానికి పూర్తి పొంతన కుదరడం లేదు. అందుకే ఈసారి మరింత పుష్ చేయడం కోసం అర్జునుడు తన ఆఖరి ఆయుధాన్ని వాడుతున్నాడు. అదే మెగాస్టార్ చిరంజీవి హాజరు.
ఇవాళ జరగబోయే సక్సెస్ మీట్ కు చిరునే ఛీఫ్ గెస్టు. సో మెగాభిమానులు పెద్ద సంఖ్యలో వేడుకకు వస్తారు. సందడి బాగా నెలకొంటుంది. ఎలాగూ తమన్ తో సహా క్రూ మెంబెర్స్ అందరూ హాజరవుతారు కాబట్టి సినిమాతో పాటు చిరుని కూడా పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇది రెండో వారంలో ఇట్లు అర్జున ఊపందుకునేందుకు ఉపయోగపడుతుందా అంటే ఎస్ అని చెప్పలేం. ఎందుకంటే ఈవెంట్ల ద్వారా వసూళ్లలో గణనీయమైన మార్పు రావడం చాలా అరుదు.
అసలే ఈ గురు శుక్రవారాల్లో కొత్త రిలీజులు చెప్పుకోదగ్గ కౌంట్ లో ఉన్నాయి. ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓమ్ మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకంగా ఇట్లు అర్జున మీద అటెన్షన్ కొనసాగడం అంత సులభంగా ఉండదు. అయినా రిజల్ట్ దాదాపుగా అర్థమైపోయిన టైంలో ఇలా విజయోత్సవ వేడుకలు నిర్వహించడం, దానికి చిరంజీవి లాంటి బడా స్టార్ ని తీసుకొచ్చి హైప్ పెంచే ప్రయత్నం చేయడం ఏ మేరకు ఫలితం ఇస్తుందో వచ్చే వీకెండ్ కి క్లారిటీ వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates