థియేటర్లు పునఃప్రారంభమై, బాక్సాఫీస్‌లో కొంత కళ కనిపించడం ఆలస్యం.. సౌత్ ఇండస్ట్రీ వాళ్లు ఆగట్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలైతే మరీ హడావుడి పడిపోతున్నారు. వరుసబెట్టి కొత్త సినిమాలకు రిలీజ్ డేట్లు ప్రకటించేస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలో కేవలం తెలుగులో మాత్రమే అటు ఇటుగా 30 సినిమాల విడుదల తేదీలు ఖరారవడం విశేషం.
ఇందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్‌ను చూసి కోలీవుడ్ ప్రొడ్యూసర్లలోనూ కదలిక వచ్చింది. మంచి సీజన్లు చూసి తమ సినిమాలకు కర్చీఫ్‌లు వేసి పెట్టేస్తున్నారు. ఈ ఏడాది వేసవికి, ఆ తర్వాత దసరాకు, ఆపై దీపావళికి దక్షిణాది నుంచి భారీ సినిమాలు విడుదల ఖరారు చేసుకున్నాయి. కాగా 2022 సంక్రాంతి మీద కూడా ఓ భారీ చిత్రం కన్నేసిందన్నది తాజా సమాచారం.
ఇటీవలే మొదలైన ప్రభాస్-ప్రశాంత్ నీల్‌ల సలార్ సినిమాను 2022 సంక్రాంతి రేసులో నిలబెట్టబోతున్నారట. ప్రభాస్ సినిమా అంటే తెలుగుకు పరిమితం కాదు. దేశమంతా భారీ ఎత్తున విడుదలవుతుంది. దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడుల్లో వసూళ్ల మోత మోగే సీజన్ ఇది. సాధారణంగా ఆ పండక్కి రెండు భాషల్లోనూ రెండు నుంచి నాలుగు చొప్పున సినిమాలు రిలీజవుతుంటాయి. సలార్ రేసులో నిలిచేట్లయితే ఆ పండుగను టార్గెట్ చేసిన వేరే భారీ చిత్రాలకు కష్టమే.
అయితే ఈ ఏడాది దసరా, దీపావళికి ఆల్రెడీలు ఆర్ఆర్ఆర్, అన్నాత్తె ఖరారయ్యాయి. ప్రభాస్ గత సినిమాలతో పోలిస్తే వేగంగానే ఈ సినిమా పూర్తి కానుందట కానీ ఈ ఏడాదిలోనే పూర్తి చేసి రిలీజ్ చేయడమంటే కష్టమే. అందుకే 2022ను టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ డేట్ విషయంలో సందిగ్ధత లేకుండా చాలా ముందుగానే డేట్ ఇచ్చేయనున్నారట. త్వరలోనే ఈ మేరకు ప్రకటన ఉండొచ్చని అంటున్నారు.
This post was last modified on January 26, 2021 8:31 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…