టచ్ చేసి చూడు.. నేల టిక్కెట్టు.. అమర్ అక్బర్ ఆంటోనీ.. డిస్కో రాజా.. రవితేజ చివరి నాలుగు సినిమాలివి. వీటికి ముందు వచ్చిన రాజా ది గ్రేట్ ఆయన చివరి హిట్ మూవీ. ఆ చిత్రానికి ముందు కూడా మాస్ రాజాకు వరుసబెట్టి ఫ్లాపులొచ్చాయి. వరుస ఫెయిల్యూర్లు ఎంతటి హీరోనైనా కిందికి లాగేస్తాయి. మార్కెట్, ఫాలోయింగ్ మీద దెబ్బ కొడతాయి. రవితేజ కూడా అందుకు మినహాయింపు కాలేదు.
ఒక టైంలో రవితేజ సినిమాకు థియేట్రికల్ హక్కుల ద్వారా రూ.25-30 కోట్ల మధ్య బిజినెస్ జరిగేది. అలాంటిది ఆయన కొత్త సినిమా క్రాక్ థియేట్రికల్ రైట్స్ రూ.17 కోట్లకు అటు ఇటుగా పలికాయి. ఈ మొత్తం కూడా వెనక్కి వస్తుందో రాదో అన్న సందేహాలు కలిగాయి విడుదలకు ముందు. ఎలాగోలా ఆ మొత్తం రికవరీ అయి రవితేజ సినిమా హిట్ అనిపించుకుంటే చాలు అనుకున్నారు అభిమానులు.
కానీ క్రాక్ అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర ఆధిపత్యం చలాయించింది. అనుకున్న దాని కంటే ఒక రోజు ఆలస్యంగా రిలీజవడం వల్ల కొంత ఆదాయం కోల్పోయినా.. ఆ నష్టాన్ని కవర్ చేయడమే కాదు.. బయ్యర్లకు ఊహించని లాభాలు అందించింది. సంక్రాంతి వీకెండ్ తర్వాత మిగతా సినిమాలు చల్లబడిపోతే క్రాక్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.50 గ్రాస్ మార్కును దాటినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
రవితేజ సినిమా ఏపీ, తెలంగాణల్లో రూ.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఇదే తొలిసారి. నాలుగు వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన సినిమా, అది కూడా మరో మూడు సినిమాలతో పోటీ పడుతూ.. అందులోనూ థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడస్తున్న టైంలో. ఇన్ని ప్రతికూలతల మధ్య మాస్ రాజా కెరీర్ బెస్ట్ మూవీగా క్రాక్ నిలవడం అనూహ్యం. హిట్టొస్తే చాలనుకుంటే ఇలా రికార్డ్ బ్రేకింగ్ మూవీ వస్తుందని రవితేజ సహా ఎవరూ ఊహించి ఉండరేమో.
This post was last modified on January 25, 2021 8:52 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…