రెండేళ్ల కిందట హిందీలో సంచలన విజయం సాధించిన చిత్రం.. అందాదున్. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. బతుకు తెరువు కోసం అంధుడిగా నటించే ఓ కుర్రాడు.. తన కళ్ల ముందు ఓ హత్య జరిగితే ఎలా స్పందించాడనే కథాంశంతో చాలా ఆసక్తికరంగా సాగుతుందీ చిత్రం. వేరే ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం దక్షిణాదిన మూడు భాషల్లో రీమేక్ అవుతుండటం విశేషం.
ఇప్పటికే తెలుగులో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో మేర్లపాక గాంధీ అందాదున్‌ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ప్రశాంత్ హీరోగా ఈ సినిమా పునర్నిర్మితం అవుతోంది. టబు పాత్రను అక్కడ సిమ్రాన్ చేస్తోంది. ఇప్పుడు మలయాళంలో కూడా అందాదున్ రీమేక్ ఖరారైంది.
మాలీవుడ్‌లో అందాదున్ రీమేక్‌లో ఓ పెద్ద హీరోనే నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. అతడికి జోడీగా హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్రలో రాశి ఖన్నా కనిపించబోతుండటం విశేషం. ఈ ఉత్తరాది భామ ముందు తెలుగులోనే స్టార్ హీరోయిన్ అయింది. ఈ మధ్య ఇక్కడ ఆమె జోరు తగ్గింది.
తమిళంలో మూణ్నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న రాశి.. ఇప్పుడు మలయాళంలోకి కూడా అడుగు పెట్టేస్తోంది. పృథ్వీరాజ్ లాంటి పెద్ద హీరోతో, అందాదున్ లాంటి సూపర్ హిట్ రీమేక్‌లో నటించడం అంటే రాశికి బంపరాఫర్ తగిలినట్లే. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి.కె.చంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందించనుండటం విశేషం. చూస్తుంటే ఈ ఏడాదే అందాదున్ మూడు రీమేక్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ఉన్నాయి.
This post was last modified on January 24, 2021 10:48 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…