ఎన్నిసార్లు ఎన్ని పాఠాలు నేర్చుకున్నా అతివృష్టి అనావృష్టి పద్దతిని టాలీవుడ్ ఇప్పట్లో విడిచిపెట్టేలా లేదు. మంచి డేట్లు వదిలేసుకోవడం, ప్యాన్ ఇండియాలకు భయపడి వెనుకడుగు వేయడం, ఒకేసారి మీడియం చిన్న బడ్జెట్ సినిమాలు మూకుమ్మడిగా దాడి చేయడం పరిపాటిగా మారిపోతున్నాయి. క్లాష్ లేకుండా ఎవరూ చేయలేరు కానీ అది వీలైనంత తక్కువగా ఉంటే అందరికీ ప్రయోజనకారిగా ఉంటుంది. నవంబర్ 12, 13 తేదీల్లో ఇలాంటి ఫీట్ మరోసారి చూడబోతున్నాం.
శర్వానంద్ ‘భోగి’ మీద మెల్లగా అంచనాలు ఏర్పడుతున్నాయి. ఊర మాస్ విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మీద టీమ్ రంగస్థలం రేంజ్ లో నమ్మకం చూపిస్తోంది. లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి హీరోగా మైత్రి సంస్థ తెరకెక్కించిన ‘దొంగ నా కొడుకు’ మరో సర్ప్రైజ్ అవుతుందని మేకర్స్ నమ్ముతున్నారు. పెద్ద సంస్థలు, చేతులు అండగా నిలబడిన ‘ఇట్లు అర్జున’ ఏదో మేజిక్ చేస్తే తప్ప ఇప్పటిదాకా జరిగిన ప్రమోషన్లు, వాయిదాలకు న్యాయం దక్కదు. ఆ స్థాయిలో కొత్త కుర్రాడికి పబ్లిసిటీ జరిగింది.
సుడిగాలి సుధీర్ ‘గోట్’ మెల్లగా బిజినెస్ వర్గాల్లో హైప్ తెచ్చుకుంటోంది. అద్భుతం చేయకపోయినా కమర్షియల్ సేఫ్ కావడంలో సుధీర్ గత కొన్ని సినిమాలు పనితనం చూపించాయి. దగ్గుబాటి రానా సమర్పించిన ‘డార్క్ చాకొలేట్’ మీద ఇప్పటికి బజ్ లేదు కానీ పెంచే ప్రయత్నంలో టీమ్ ఉంది. ఇవి కాకుండా ఆహ్, మాయలేడి, చంద్రయాన్, రోమియో జూలియట్, టాల్కమ్ పౌడర్ కూడా రేసులో ఉన్నాయి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు.
కౌంట్ బాగుంది సరే క్వాలిటీ కూడా దానికి తగ్గట్టే ఉంటే ఇంకా మంచిది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడియన్స్ కి ఇన్నేసి ఆప్షన్లు ఉండటం నిర్మాతలకు రిస్క్. ఎందుకంటే ప్రేక్షకులు మహా అంటే ఒకటి రెండు కంటే మించి సినిమాలు చూడలేకపోతున్న ట్రెండ్ లో ఇలా ముప్పేటదాడి చేయడం లేనిపోని కన్ఫ్యూజన్ తీసుకొస్తుంది. అందులోనూ రామాయణ రెండో వారంలోనూ బలంగా ఉండే సూచనలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ ఎలా వర్కౌట్ చేసుకుంటాయో చూడాలి.
This post was last modified on November 7, 2026 3:14 pm
సీనియర్ నటి సురేఖ వాణి పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి…
పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏమీ మారలేనట్టే కనిపిస్తుంది. మమతా బెనర్జీ పాలనలో మితిమీరిపోయిన రౌడీయిజంతో విసుగెత్తిన ప్రజలు బీజేపీకి ఓట్లేసి…
కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో యష్ ఒప్పుకున్న సినిమాలు రెండు. టాక్సిక్ ఏమయ్యిందో తెలిసిందే. అర్థం…
చిన్న చిన్న క్యారెక్టర్లతో తమిళంలో తన కెరీర్‌ను మొదలుపెట్టిన త్రిష.. ఆ తర్వాత ఎంతో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ముఖ్యంగా…
కమల్ హాసన్ కొత్త సినిమా సండియార్ నిన్న అధికారికంగా ప్రకటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రివెంజ్ ఇంటెన్స్…
డిసెంబర్ లో ప్రారంభం కాబోతున్న చిరంజీవి టాక్ షో మెగావర్స్ షూటింగ్ ఆర్టిస్టుల డేట్లను బట్టి నిర్విరామంగా జరిగిపోతోంది. బ్రహ్మానందం…