Movie News

అక్క తీరు మామూలుగా లేదుగా..!

హీరోయిన్ కీర్తి సురేష్ అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది పక్కింటి అమ్మాయి లాంటి అందం. ముఖ్యంగా మహానటి సినిమాతో ఆమెకు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. తెలుగులో కీర్తి నటించిన సినిమాలు అన్నిట్లో కూడా ఆమె దాదాపు పద్ధతి గానే కనిపించింది. అయితే కీర్తి సురేష్‌లో మరో కోణం కూడా ఉందని ఆమె సోషల్ మీడియా ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కీర్తి సురేష్ నటించిన అక్క వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్‌లో కీర్తితో పాటు రాధిక ఆప్టే కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇద్దరు నటీమణులు కలిసి నటించడం ఈ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. మరోవైపు డోరతీ సినిమాతో కూడా కీర్తి మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా మంచి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె, ఇప్పుడు తన ఫోటోలతో అభిమానులను ఫిదా చేస్తోంది.

తాజాగా కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని స్టైలిష్ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల్లో కీర్తి సురేష్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించింది. నల్లటి దుస్తులకు బంగారు రంగు పులి డాలర్.. మరి మరికొన్ని అందమైన ఆభరణాలు జతచేసి ఎంతో ప్రత్యేకంగా.. అలానే రాయల్ గా ముస్తాబైంది.

ఈ ఫోటోల్లో కీర్తి సురేష్ ఇచ్చిన పోజులు కూడా.. కీర్తి నువ్వు కేక అనేలానే ఉన్నాయి. కొన్ని ఫోటోల్లో కళ్లద్దాలు పెట్టుకుని ఎంతో స్టైలిష్‌గా కనిపించగా, మరికొన్ని ఫోటోల్లో తన దుస్తులు, ఆభరణాలను హైలైట్ చేస్తూ కనిపించింది.

ఈ ఫోటోలకు కీర్తి సురేష్.. “అక్క ఇన్ ఎ పారలల్ యూనివర్స్” అంటూ సరదా క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ఫోటోలకు సంబంధించిన స్టైలింగ్‌ను మోహిత్ రాయ్, తరంగ అగర్వాల్ చేశారు. దుస్తులను రా మాంగో అందించగా, ఆభరణాలను అపాలా బై సుమిత్ అందించారు. మేకప్‌ను అనిఘా జైన్, హెయిర్ స్టైలింగ్‌ను తేజసింగ్ చేశారు. గ్రీషా గుప్తా సహాయకురాలిగా పనిచేయగా, తేజస్ నెరూర్కర్ ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.

ఏది ఏమైనా.. సినిమాల్లో సింపుల్‌గా కనిపించే కీర్తి సురేష్ ఫోటోషూట్‌లలో మాత్రం తన స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. అక్క పాత్రలోనే కాదు, ఈ కొత్త ఫ్యాషన్ లుక్‌లోనూ ఆమె తీరు మామూలుగా లేదుగా అని అభిమానులు అనేలా ఈ ఫోటోలలో మెరిసిపోయింది ఈ భామ.

This post was last modified on November 7, 2026 11:58 am

Page: 1 2 3

Share

Recent Posts

యష్ తీసుకున్న నిర్ణయం సరైనదే

కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత హీరో యష్ ఒప్పుకున్న సినిమాలు రెండు. టాక్సిక్ ఏమయ్యిందో తెలిసిందే. అర్థం…

1 hour ago

ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిలా మెరుస్తున్న త్రిష

చిన్న చిన్న క్యారెక్టర్లతో తమిళంలో తన కెరీర్‌ను మొదలుపెట్టిన త్రిష.. ఆ తర్వాత ఎంతో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ముఖ్యంగా…

2 hours ago

పాతికేళ్ల వివాదాన్ని వదిలిపెట్టని కమల్

కమల్ హాసన్ కొత్త సినిమా సండియార్ నిన్న అధికారికంగా ప్రకటించారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రివెంజ్ ఇంటెన్స్…

2 hours ago

ఇద్దరు మిత్రులు ఇవ్వబోతున్న సర్ప్రైజులేంటి

డిసెంబర్ లో ప్రారంభం కాబోతున్న చిరంజీవి టాక్ షో మెగావర్స్ షూటింగ్ ఆర్టిస్టుల డేట్లను బట్టి నిర్విరామంగా జరిగిపోతోంది. బ్రహ్మానందం…

3 hours ago

జడ్పీ చైర్మన్ పంపకాలు ఖరారు?

స్థానిక ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా వున్న కూటమి పార్టీల మధ్య జడ్పీ చైర్మన్ స్థానాల విషయం ఫైనల్ అయినట్లు సమాచారం.…

3 hours ago

రామాయణ ఎక్కడిదాకా దూసుకెళ్తుంది

బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ ఊపిరొచ్చింది. వందల కోట్ల వసూళ్లు తెచ్చే బ్లాక్ బస్టర్ కోసం కళ్ళు కాయలు కాచేలా…

4 hours ago