ట్యూన్స్ కాపీ కొడతాడంటూ ఎన్ని రకాల ట్రోల్స్ వస్తున్నా… వాటితో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. బన్నీ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో తమన్ మ్యూజిక్ అందించిన పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి.
‘బుట్ట బొమ్మ’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా… ‘సామజవరగమన’, ‘రాములో రాముల’ సాంగ్స్ యూట్యూబ్‌లో 150+ మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టాయి. యావరేజ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ప్రాణం పోశాయి. ‘అల వైకుంఠపురంలో’ఎఫెక్ట్‌తో తమన్‌కు కోలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్టు టాక్.
ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, రవితేజ ‘క్రాక్’, నాని ‘టక్ జగదీశ్’, వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీకి మ్యూజిక్ అందిస్తూ యమా బిజీగా ఉన్న తమన్… నాని 25వ మూవీ‘వీ’కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ‘అల వైకుంఠపురంలో’ సాంగ్స్ వచ్చిన రెస్పాన్స్ చూసి ఇంప్రెస్ అయిన కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్, మురగదాస్‌తో చేయబోయే చిత్రానికి తమన్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేశారట.
మురగదాస్, విజయ్ కాంబోలో వచ్చిన ‘తుపాకీ’, ‘కత్తి’, ‘సర్కార్’ సినిమాలు మంచి మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఏ.ఆర్. రెహమాన్, అనిరుథ్ వంటి కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్లను కాదని, తెలుగులో సత్తాచాటిన తమన్‌ను ఎంపికచేయడం అక్కడ హాట్ టాపిక్ అయ్యింది.
తెలుగుతో పాటు కోలీవుడ్‌లో కూడా సూపర్ స్పీడ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్న తమన్‌కు విజయ్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే అవకాశం కోలీవుడ్‌లో తొలిసారి దక్కింది. మరి తమన్ ఈ లక్కీ ఛాన్స్‌ను ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.
This post was last modified on May 6, 2020 1:05 pm
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…