నవంబర్ 12 శర్వానంద్ భోగి సినిమా విడుదల. అనౌన్స్ మెంట్ ఎప్పుడో ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, లిరికల్ సాంగ్ రెండూ బాగానే రీచ్ తెచ్చుకున్నాయి. రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాగా రూపొందిన భోగిలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా సంపత్ నంది దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే రిలీజ్ డేట్ కేవలం వారమే ఉన్నా ఇప్పటిదాకా ప్రమోషన్స్ పరంగా సౌండ్ పెంచేందుకు ఎల్లుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతున్నారు
నవంబర్ 12 మంచి స్లాట్. కాంపిటీషన్ కూడా పెద్దగా లేదు. దీపావళి పండక్కు వచ్చిన రామాయణ, సీన్, మహాశక్తి డబ్బింగ్ సినిమాలు కాబట్టి స్ట్రెయిట్ మూవీ పరంగా భోగికి పెద్ద అడ్వాంటేజ్ దక్కుతుంది. సమ్మర్ హాలిడేస్ చిన్న సినిమా అందులోనూ చిన్న పిల్లలను టార్గెట్ చేసినది కావడంతో మాస్ ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా భోగి నిలుస్తుంది. ఇలాంటి వాటికి టాక్ చాలా కీలకం. యావరేజ్ ఉన్నా సూపర్ హిట్ చేస్తారు, బాగుంటే బ్లాక్ బస్టర్ కట్టబెడతారు. తేడా కొడితేనే ఇబ్బంది.
నిజానికి భోగి ముందు ఫిక్స్ చేసుకున్నది ఆగస్ట్ మూడో వారంలో. అది కూడా ప్యారడైజ్ కు పోటీగా. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. అది మంచే చేసింది. మిగిలిన పనులు పూర్తి చేయడానికి సరిపడా సమయం దొరికింది. దర్శకులు సంపత్ నంది ఇందులో చాలా రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. శర్వానంద్ విపరీతంగా కష్టపడిన వైనం గురించి యూనిట్ నుంచి ఆల్రెడీ టాక్ ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి మాములుగా చెప్పడం లేదు. ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.
చేతిలో ఉన్న ఏడు రోజులు భోగికి ప్రాపర్ గా పబ్లిసిటీ చేసుకోవడం అవసరం. జనాలకు కనెక్ట్ అయితే చాలు నవంబర్ నెలని డామినేట్ చేయొచ్చు. కనీసం రెండు వారాలు ఢోకా ఉండదు. తర్వాత డిసెంబర్ ఎలాగూ ప్యాక్ అయిపోయింది. వృష్కకర్మ, కింగ్ 100, దాదా అంటూ క్రేజ్ ఉన్న సినిమాలు క్యూ కట్టాయి. సో నవంబరే భోగికి కాసులు కురిపించే సీజన్. ఇంకో రెండు నెలలు తిరగడం ఆలస్యం శర్వానంద్ మరో సినిమా జార్జ్ క్రిష్ సంక్రాంతి బరిలో సిద్ధంగా ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates