చడీచప్పుడు లేకుండా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా సెట్ చేసేశాడు ప్రభాస్. వీరి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుందన్న ఊహల్లో అభిమానులు ఉండగానే.. ఆ కాంబినేషన్ ఓకే అయిపోయింది. ‘సలార్’ పేరుతో ఇద్దరూ సినిమా చేయనున్నట్లు రెండు నెలల కిందటే ప్రకటించారు. ఈ మధ్యే ఆ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. నెలాఖర్లో షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో ప్రధాన తారాగణం గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. విలన్‌గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఓకే అయ్యాడని.. హీరోయిన్‌గా దిశా పఠానిని ఖరారు చేశారని.. పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్లో క్రేజ్ కోసం వారిద్దరినీ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు దానికి భిన్నమైన ప్రచారం నడుస్తోంది.
ప్రభాస్ సరసన కథానాయికగా స్టార్ హీరోయిన్ ఎవరినీ తీసుకోలేదని, ఒక కొత్తమ్మాయి అతడితో రొమాన్స్ చేయనుందని తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. దీనికి తోడు ‘సలార్’ విలన్‌గా కొత్త పేరు వినిపిస్తోంది. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ‘సలార్’ విలన్‌గా ఖరారు చేసినట్లు చెబుతున్నారు. మరి జాన్‌తో పాటు సేతుపతి కూడా ఈ చిత్రంలో ఉంటాడా లేక జాన్ స్థానంలో అతణ్ని తీసుకున్నారా అన్నది తెలియదు.
జాన్ అబ్రహాం విలన్ అయితే ఉత్తరాదిన ఈ సినిమాకు బంపర్ క్రేజ్ వస్తుంది. సేతుపతి కనిపిస్తే సౌత్‌లో ఈ సినిమాకు వచ్చే హైప్ వేరుగా ఉంటుంది. ఇటీవల ‘మాస్టర్’ సినిమాలో సేతుపతి విజయ్‌ను ఢీకొనడం వల్ల ఆ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. సినిమా అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ సేతుపతి భలేగా హైలైట్ అయ్యాడు. అలాంటిది ‘సలార్’ లాంటి భారీ చిత్రంలో ప్రభాస్‌ను సేతుపతి ఢీకొడితే దానికొచ్చే క్రేజే వేరుంటుంది.
This post was last modified on January 23, 2021 4:05 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…