స్టార్ హీరోలకు బయట కోట్ల మంది అభిమానులుంటారు. కానీ స్టార్ హీరోల్లో కూడా అభిమానులను సంపాదించుకునే వాళ్లు కొందరే ఉంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ కోవకు చెందిన వాళ్లే. ఆయన తమిళ నటుడే అయినా.. కోలీవుడ్ మాత్రమే కాక, అనేక ఇండస్ట్రీలో ఆయనకు వీరాభిమానులున్నారు. ఆ అభిమానాన్ని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉంటారు.
ఐతే ఆ ఫ్యాన్స్‌లో కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ను మించిన వాళ్లు ఉండరేమో. రజినీ పేరు చెబితే చాలు అతను ఊగిపోతుంటాడు. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటాడు. తాను ఇప్పుడున్న స్థాయికి రజినీనే కారణం అని ఎప్పటికప్పుడు చెబుతూ ఉండే రాఘవ లారెన్స్.. సూపర్ స్టార్ మీద తరచుగా సేవా కార్యక్రమాలు, వేడుకలు చేస్తుంటాడు. ఈసారి రజినీ పుట్టిన రోజుకు చాలా ముందుగానే రెడీ అయిపోయాడు లారెన్స్.
ఈ డిసెంబరు 12న రజినీకి 76 ఏళ్లు పూర్తవుతాయి. 75 ఏళ్ల వయసులో ఆయన ‘జైలర్-2’లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నేపథ్యంలో ఈసారి పుట్టిన రోజును ప్రత్యేకంగా చేయాలని లారెన్స్ నిర్ణయించుకున్నాడు. అందుకే నవంబరు 12 నుంచి డిసెంబరు 12 వరకు నెల రోజుల పాటు రజినీ పుట్టిన రోజు వేడుకలను పెద్దగా చేయాలని అతను నిర్ణయించాడు. ఈ నెల రోజుల్లో అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నాడట. అవేంటన్నది సోషల్ మీడియాలో వెల్లడించబోతున్నాడు.
ఐతే ఈ కార్యక్రమాలు అన్నీ అయ్యాక డిసెంబరు 12న రజినీని ఆహ్వానించి పెద్ద వేడుక చేయాలని లారెన్స్ అనుకున్నాడట. కానీ సూపర్ స్టార్‌కు ఇవన్నీ నచ్చవు, ఆయన సింపుల్ మనిషి కాబట్టి ఆ ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పాడు.
ఈ వేడుకలు, కార్యక్రమాల గురించి చెబుతూ.. మరోసారి రజినీ తన జీవితంలో ఎంత కీలకమో అతను వివరించాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక స్థాయిలో ఉన్నానంటే రజినీ ఇచ్చిన అండ వల్లే అని అతను స్పష్టం చేశాడు. ‘వన్ మంత్, వన్ సెలబ్రేషన్, వన్ తలైవర్’ అంటూ ఒక నినాదంతో రజినీ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి తన ఆలోచనను పంచుకున్నాడు రాఘవ లారెన్స్. ఈ పోస్టుకు సూపర్ స్టార్ అభిమానుల నుంచి గొప్ప స్పందన వస్తోంది. లారెన్స్‌ను మించిన రజినీ ఫ్యాన్ ఉండడంటూ ఆయన్ని కొనియాడుతున్నారు ఫ్యాన్స్.
This post was last modified on November 5, 2026 6:47 pm
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన…
మొదటి సినిమా సీతారామంతోనే.. సీత పాత్రలో కనిపించి.. తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వచ్చిన…
థియేటర్ రిలీజ్ జరిగిన నెలలోపే జైలర్ 2 ఓటిటిలో వచ్చేస్తోంది. నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్…
ఇటీవలే కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పెద్ది పాత్ర గురించి జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు, జీవితంలో ఇలాంటి తప్పు పాత్ర…
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్లు,…
వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు జరిగిన తీరును వైసీపీ నేతలు మరిచిపోయినా...ఏపీ ప్రజలు మర్చిపోరు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా…