థియేటర్ రిలీజ్ జరిగిన నెలలోపే జైలర్ 2 ఓటిటిలో వచ్చేస్తోంది. నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు రన్ ఇంకా బలంగా ఉన్న టైంలో ఇలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వడం పట్ల డిస్ట్రిబ్యూషన్ వర్గాలు భగ్గుమంటున్నాయి. దీపావళికి కలెక్షన్లు పెరిగి మళ్ళీ ఊపందుకుంటాయని ఎదురు చూస్తున్న టైంలో ఇలా హఠాత్తుగా బాంబు పేల్చడం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు విషయం ఇది కాదు.
ఎడిటింగ్ టేబుల్ దగ్గర జైలర్ 2 ఫుటేజ్ చాలా ఎగిరిపోయింది. ముఖ్యంగా మోహన్ లాల్, హృతిక్ రోషన్ సీన్లు కొన్ని ఫ్లోకు అడ్డం వస్తాయని భావించి తీసేశారట. వీటితో పాటు కమెడియన్ సంతానం నటించిన ఎపిసోడ్, విజయ్ సేతుపతికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు అన్నీ కోతకు గురయ్యాయని చెన్నై మీడియాలో కథనాలు వచ్చాయి. అవన్నీ కలుపుకుంటే ఇంకో అరగంటపైనే ఈజీగా ఉంటుంది. ఓటిటి వెర్షన్ లో వీటిని జోడించాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే సాధారణంగా ఓటిటి కంపెనీలు అగ్రిమెంట్లు రాసుకునే టైంలో థియేటర్ వెర్షన్ నే స్ట్రీమింగ్ చేసేలా నిబంధన పెట్టుకుంటాయి. ఎక్స్ టెండెడ్ కట్ పేరుతో కొంత కలపొచ్చు కానీ అదంతా మహా అయితే ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. యానిమల్, జవాన్, పఠాన్ విషయంలో ఇలాంటి ప్రచారాలు జరిగి చివరికి చెప్పుకోదగ్గ ఎక్స్ ట్రా కంటెంట్ పెద్దగా లేకుండానే ఓటిటిలో వచ్చాయి. ఇప్పుడు జైలర్ 2 మీద కూడా అలాంటి ఆశలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.
దీని సంగతి అలా ఉంచితే కోలీవుడ్ బయ్యర్లు ఒకపక్క ఓటిటి విండోల గురించి ఆందోళన చేస్తుంటే ఇంకోవైపు జైలర్ 2 లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు ఇలా నాలుగు వారాలకే ఇంటికి వస్తే ఎలా అని వాపోతున్నారు. రిలీజ్ కు ముందు అనుమానాలతో వచ్చిన రజనీకాంత్ ఇప్పుడు ఏకంగా ఎనిమిది వందల కోట్ల ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడీ విజయం రజని కమల్ మల్టీస్టారర్ హ్యాండిల్ చేయడానికి సరిపడా ధైర్యాన్ని దర్శకుడు నెల్సన్ కు ఇచ్చింది.
This post was last modified on November 5, 2026 5:41 pm
స్టార్ హీరోలకు బయట కోట్ల మంది అభిమానులుంటారు. కానీ స్టార్ హీరోల్లో కూడా అభిమానులను సంపాదించుకునే వాళ్లు కొందరే ఉంటారు.…
ఇటీవలే కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పెద్ది పాత్ర గురించి జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు, జీవితంలో ఇలాంటి తప్పు పాత్ర…
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్లు,…
వైసీపీ హయాంలో స్థానిక సంస్థలు జరిగిన తీరును వైసీపీ నేతలు మరిచిపోయినా...ఏపీ ప్రజలు మర్చిపోరు. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా…
వైసీపీ హయాంలో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా నడిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై…
కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న సినిమాలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ ఇమేజ్ ఉన్న నటీనటులు కాకుండా చిన్న పిల్లలను…