Political News

త‌ను వెళ్ల‌క‌పోగా… జ‌గ‌న్ త‌న‌వారీనీ అడ్డుకున్నారా?

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల, సువార్త‌ బోధ‌కుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ దంప‌తుల కుమార్తె అంజ‌లి, సోమ‌ల ర‌ఘురామిరెడ్డిల వివాహం పూర్త‌యింది. బెంగ‌ళూరులోని నందిహిల్స్‌లో కొంత మంది కుటుంబ స‌భ్యులు, ప్ర‌త్యేక ఆహ్వానితుల మ‌ధ్య ఈ వివాహం… పూర్త‌యిన‌ట్టు ష‌ర్మిల కుటుంబం పేర్కొంది. ఈ వివాహాన్ని పూర్తిగా క్రిస్టియ‌న్ సంప్రదాయంలో నిర్వ‌హించారు. విదేశాల నుంచి వ‌చ్చిన క్రీస్తు సువార్తికులు ఈ వివాహాన్ని జ‌రిపించిన‌ట్టు తెలిసింది.

మళ్లీ.. కూడా..

ష‌ర్మిల కుమార్తె వివాహాన్ని గురువారం కూడా నిర్వ‌హించ‌నున్నారు. గురువారం సాయంత్రం బెంగ‌ళూరులోని అదే ప్యాలెస్‌లో చేప‌ట్ట‌నున్నారు. ఈ సారి పూర్తి హిందూ సంప్ర‌దాయంలో ఈ వివాహ‌వేడుక‌ను నిర్వ‌హిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జ‌రిగిన‌ట్టు ష‌ర్మిల పేర్కొన్నారు. తూర్పుగోదావ‌రికి చెందిన పండితుల‌ను ఈ వివాహ క్ర‌తువుకు ఆహ్వానించిన‌ట్టు తెలిసింది. పెళ్లి కుమారుడు ర‌ఘురామిరెడ్డి కుటుంబ స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక నిర్వ‌హించ‌నున్నారు.

రేవంత్‌.. కూడా..

ఇక‌, ఈ వివాహం వ్య‌వ‌హారం దాదాపు మూడు నెల‌లుగా హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. వివాహానికి సంబంధించి బెంగ‌ళూరు స‌మీపంలోని య‌ల‌హంక‌ ప్యాలెస్ ను ఇవ్వాల‌ని ష‌ర్మిల కోరడం.. తాను ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ చెప్ప‌డం.. చివ‌ర‌కు ఈ వ్య‌వ‌హారం కోర్టుకు చేర‌డం తెలిసిందే. దీంతో వివాహ వేదిక‌ను నందిహిల్స్‌కు మార్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి అంటే.. గురువారం జ‌రిగే హిందూ సంప్ర‌దాయ వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిస‌హాలు ప‌లువురు తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

త‌ను వెళ్ల‌కుండా..

ఇక‌, మేన‌కోడ‌లు అంజ‌లి వివాహానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ హాజ‌రు కావ‌డం లేదు. అయితే.. ఆయ‌న‌కు ఆహ్వానం అంద‌లేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదెలా ఉన్నా.. మ‌రోవైపు వైఎస్ కుటుంబంలో ఈ వివాహానికి సంబంధించి చీలిక వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. జ‌గ‌న్ వ‌ర్గంగా ముద్ర ప‌డిన వారు ఎవ‌రూ ఈ వివాహానికి వెళ్ల‌రాద‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఇది జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌ని.. వారిని ఆయ‌న వెళ్ల‌ద్ద‌ని సూచించ‌డంతో అంద‌రూ క‌లిసి ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా… వివాహం అయిపోయింది. కానీ, వివాదాలే మిగిలాయి.

This post was last modified on November 26, 2026 3:44 pm

Share

Recent Posts

అంగ‌బ‌ల‌మే కాదు… ఆర్థికంగానూ టీడీపీనే ఫ‌స్ట్‌!

రాజ‌కీయ పార్టీల‌కు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల బలం అత్యంత ముఖ్యం. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. గెలుపునే కాదు..…

11 minutes ago

చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా కొట్టుకున్నారా?

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నా…

22 minutes ago

“మీరు ఒంట‌రిగా ఉన్నారా?“… అయితే ఈ `మోసం` మీకోస‌మే!

సోష‌ల్ మీడియాను హ్యాండిల్ చేసే విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అత్యంత ముఖ్యం. క‌నిపించిన ప్ర‌తి సందేశాన్నీ.. ఆక‌ట్టుకునే మాట‌ల‌తో ఆక‌ర్షించే అమ్మాయిల…

36 minutes ago

వినాశనాన్ని అడ్డుకునే ‘వృషకర్మ’ సంకల్పం

తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్యకి గ్యాప్ వచ్చేసింది. కారణం వృషకర్మ. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో కెరీర్ లోనే…

3 hours ago

బంధాల మధ్య చిచ్చు పెడుతున్న భోజనాలు

భారతీయ పెళ్లిళ్లలో భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లికి వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేయడం కుటుంబాలు తమ…

3 hours ago

పెళ్లి వేడుకలో పిచ్చి సాహసం.. గుర్రపు పందేల కోసం..

వినోదం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకు తెస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బీహార్‌లో జరిగిన…

5 hours ago