Political News

చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా కొట్టుకున్నారా?

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నా మొన్నటిదాకా ప్రశాంతంగా వున్న పల్లె సీమల్లో ఈ ఎన్నికల పుణ్యామా అంటూ విభేదాలు, విద్వేషాలు రాజకున్నాయి. మామా, బావ, బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే గ్రామీణుల మధ్య రాజకీయ వైరం మొదలైనట్టే కనిపిస్తుంది. గ్రామీణ ప్రజలు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలుగా విడిపోయారు. విడిపోయి కొట్టుకుంటున్నారు. 

ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దూకారు. తమ అనుచరులను పోటీకి దింపి విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల సతీమణులు, ఎంపీల తండ్రులు కూడా సర్పంచ్ గా, మున్సిపల్ చైర్మన్ గా, మేయర్ గా ఎన్నికల్లో పోటీకి దిగారంటే స్థానిక ఎన్నికలను ఆయా పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. 

ఈ క్రమంలోనే కడప జిల్లాలో ఒక జనసేన కార్యకర్త మరణించాడు. కడప జిల్లా చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి పంచాయతీ ఎన్నికల నామినేషన్ సందర్బంగా వివాదం ఏర్పడింది. నామినేషన్ పరిశీలనకు రామాంజులును రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గుండెపోటుకు గురయ్యారు. అక్కడికక్కడే మృతి చెందారు.

టీడీపీ నేతల వేధింపులు, పోలీసుల ఒత్తిడి కారణం వల్లనే రామాంజులు మృతి చెందాడని జనసేన నాయకులు ఆరోపించారు. ఇక్కడ ఒక్కచోటే కాదు మొత్తం రాయలసీమ, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, గోదావరి జిల్లాల్లో కూడా అనేక చోట్ల ఘర్షణలు జరిగాయి. ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు చర్చనియాంశంగా మారింది. ఆది ఏమన్నాడంటే… ఏ రోజైనా, పొరపాటునైనా చంద్రబాబు, జగన్‌మోహన్ రెడ్డిలు ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని కొట్టుకోవడం చూశారా…నాయకులు ఎప్పుడూ కొట్టుకోరు.. మాటల వరకు అనుకుంటారు.. రాజకీయాలు అలాగే వుంటాయి, అంత మాత్రం దానికి కింది స్థాయి కార్యకర్తలు ఎందుకు కొట్టుకోవాలని ఆది ప్రశ్నించారు.

ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగినా కిందిస్థాయిలో కార్యకర్తలు గొడవపడి ఘర్షణకు దిగుతున్నారని, ఒకర్ని ఒకరు చంపుకునే ఘటనల్ని చాలానే చూశామన్నారు. రాజకీయాల్లో ఆలోచనా విధానం ఉండాలి కానీ ఆవేశం ఉండకూడదని హితవు పలికారు. 

క్షణికావేశానికి గురైన మీకు ఏదైనా జరగరానిది జరిగితే మీ కుటుంబం, భార్యా బిడ్డలు ఆనాధలు మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు బావుంటే మీ ఫ్యామిలీ బావుంటుంది. ఆవేశంలో మీరు ఒకరిపై మరొకరు గొడవపడి, చంపుకోవడాలు చేయొద్దు.. మీ కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయని హైపర్ ఆది సూచించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మాటలు మన నాయకుల నోటి నుంచి  వస్తే బాగుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on November 26, 2026 3:35 pm

Share

Recent Posts

“మీరు ఒంట‌రిగా ఉన్నారా?“… అయితే ఈ `మోసం` మీకోస‌మే!

సోష‌ల్ మీడియాను హ్యాండిల్ చేసే విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అత్యంత ముఖ్యం. క‌నిపించిన ప్ర‌తి సందేశాన్నీ.. ఆక‌ట్టుకునే మాట‌ల‌తో ఆక‌ర్షించే అమ్మాయిల…

20 minutes ago

వినాశనాన్ని అడ్డుకునే ‘వృషకర్మ’ సంకల్పం

తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్యకి గ్యాప్ వచ్చేసింది. కారణం వృషకర్మ. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో కెరీర్ లోనే…

2 hours ago

బంధాల మధ్య చిచ్చు పెడుతున్న భోజనాలు

భారతీయ పెళ్లిళ్లలో భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లికి వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేయడం కుటుంబాలు తమ…

3 hours ago

పెళ్లి వేడుకలో పిచ్చి సాహసం.. గుర్రపు పందేల కోసం..

వినోదం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకు తెస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బీహార్‌లో జరిగిన…

4 hours ago

హోమ్ గ్రౌండ్‌లో బయటపడిన ఓమ్ బలహీనత

ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రూపొందిన ఓమ్ వంద కోట్ల గ్రాస్ దాటేసింది. ఇందులో…

4 hours ago

రామాయణ 2 అంచనాలకు రంగం సిద్ధమేనా

కొన్ని నెలల క్రితం టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కు గురైన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు…

5 hours ago